Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 స్పెషల్ సాంగ్ అలా ప్లాన్ చేస్తున్నారా.. డబుల్ ధమాకా ఇచ్చేందుకు సిద్ధమా..?

Pushpa 2 Special Item Song Sukumar Double Dhamaka Planing

Pushpa 2 Special Item Song Sukumar Double Dhamaka Planing

Pushpa 2 ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా పై ఇప్పటికే తారాస్థాయిలో అంచనాలు ఉండగా వాటిని మరింత పెంచేలా మేకర్స్ ప్లానింగ్ ఉంది. పుష్ప 2 సినిమాలో రష్మిక హీరోయిన్ కాగా సినిమాలో మరో స్పెషల్ సాంగ్ కోసం మరో అందాల భామని దించే ప్లాన్ లో ఉన్నారు. అయితే పుష్ప 1 లో సమంత ఉ అంటావా సాంగ్ తో సంచలనం సృష్టించగా పుష్ప 2 తో దానికి రెట్టింపు ఉండేలా స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట.

పుష్ప 2 లో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్నది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఈ సాంగ్ విషయంలో సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. పుష్ప 2 లో బాలీవుడ్ భామతో స్పెషల్ సాంగ్ చేయిస్తుండా క్యామియోగా పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ చేసిన సమంతని కూడా తీసుకొచ్చేలా చేస్తున్నారట.

అలా పుష్ప 2 లో ఐటెం సాంగ్ లో ఇద్దరు భామలతో డబుల్ ధమాకా ఉండబోతుందని తెలుస్తుంది. సుకుమార్ ఐటెం సాంగ్స్ కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. మరి ఇప్పుడు పుష్ప 2 లో ఈ మేనియా కొనసాగిస్తాడా లేదా అన్నది చూడాలి. పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కోసమే రిపీటెడ్ ఆడియన్స్ ఉండేలా సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ కూడా పుష్ప 2 కోసం ది బెస్ట్ మ్యూజిక్ అందించనున్నారు. తప్పకుండా ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని చెప్పుకుంటున్నారు.

Also Read : Double Ismart : డబుల్ ఇస్మార్ట్.. పూరీ వాళ్లను ఎందుకు సైడ్ చేశాడు..?