Site icon HashtagU Telugu

Pushpa 2 : అల్లు అర్జున్ లేకుండా పుష్ప 2 షూటింగ్ చేయబోతున్నారా..!

Pushpa 2, Allu Arjun, Rashmika Mandanna

Pushpa 2, Allu Arjun, Rashmika Mandanna

Pushpa 2 : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఆడియన్స్ అంతా ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? అని ఎదురు చూస్తున్నారు. కానీ చిత్ర యూనిట్ మాత్రం.. బ్రేక్‌లు మీద బ్రేక్‌లు తీసుకుంటూ షూటింగ్ ని ఆలస్యం చేస్తూ వస్తున్నారు.

సినిమా షూటింగ్ కి పదే పదే బ్రేక్‌లు పడుతుండడంతో ఫిలిం వర్గాల్లో పలు రూమర్లు పుట్టుకొచ్చాయి. అల్లు అర్జున్ మరియు సుకుమార్ మధ్య గొడవలు వచ్చాయని, అందుకే షూటింగ్ కి అనవసరపు బ్రేక్‌లు పడుతూ వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ మళ్ళీ వాయిదా పడబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇక ఈ వార్తలతో బన్నీ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఇక ఈ వివాదం గురించి అల్లు అర్జున్ మూవీ టీం రియాక్ట్ అవుతూ.. వారిద్దరి మధ్య ఏ గొడవలు లేవని, కొన్ని పర్సనల్ విషయాలు వల్లే సినిమా షూటింగ్ కి బ్రేక్‌లు వచ్చాయని చెప్పుకొచ్చారు.

అయితే ఈ బ్రేక్‌ల్లో కూడా సినిమా పనులు జరుగుతూనే ఉన్నాయని, మూవీ ఎడిటింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ మూవీ మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టుకోబోతుందట. అయితే అల్లు అర్జున్ లేకుండానే మూవీ టీం షూటింగ్ ని స్టార్ట్ చేయబోతున్నారట. రేపు (జులై 23) రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేసి.. అల్లు అర్జున్ లేని సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. అయితే అల్లు అర్జున్ మళ్ళీ షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటారు అనేదాని పై ఎటువంటి సమాచారం లేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫారిన్ లో ఫ్యామిలీ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version