Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 లో సమంత ఉంటుందా.. ఐటం సాంగ్ పై అప్డేట్ ఏంటి..?

Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Pushpa 2 అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మొదటి పార్ట్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. తెలుగులో రిలీజ్ అనుకున్న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవ్వడంతో బీ టౌన్ ఆడియన్స్ ని మెప్పించింది. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పుష్ప 2 మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది. పుష్ప 2 ని కూడా అంచనాలకు తగినట్టుగా తెరకెక్కిస్తున్నారు. పుష్ప 2 ఈ ఇయర్ ఇండిపెండన్స్ డే కి రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

We’re now on WhatsApp : Click to Join

పుష్ప 1 లో దేవి మ్యూజిక్ కూడ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సినిమా హిట్ లో డి.ఎస్.పి శాతం కూడా ఉంది. అయితే పుష్ప 2 విషయంలో కూడా దేవి అదరగొట్టబోతున్నట్టు తెలుస్తుంది. పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తుంది. ఆ సాంగ్ లో సమంత గ్లామర్ ట్రీట్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే పుష్ప 2 లో సమంత బదులు వేరే హీరోయిన్ ని తీసుకుంటారని టాక్.

పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ ని బీట్ చేసేలా పుష్ప 2 లో సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే రెండో భాగంలో సమంత తోనే ఐటెం సాంగ్ చేయించాలని అంటున్నారు ఆమె ఫ్యాన్స్. సమంత అయితేనే పుష్ప 2 కి కూడా ఆ లక్ కలిసి వస్తుందని అంటున్నారు. అయితే పుష్ప 2 లో సమంత ఉంటుందా లేదా అన్నది డౌటే అని చెబుతున్నారు. పుష్ప 2 స్పెషల్ సాంగ్ విషయంలో సుకుమార్ ప్లానిగ్ పెద్దగానే ఉందని తెలుస్తుంది.

Also Read : Mahesh Babu : గురూజీలో ఇంత మాస్ యాంగిల్ ఎవరు ఊహించలేదే..!

పుష్ప పార్ట్ 2 లో అన్ని సాంగ్స్ తో పాటుగా ఈ స్పెషల్ సాంగ్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుస్తుంది. పుష్ప 2 సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నారు. సినిమా బడ్జెట్ విషయంలో కూడా పార్ట్ 1 కి డబుల్ పెట్టేస్తున్నారని తెలుస్తుంది.

సుకుమార్, అల్లు అర్జున్, దేవి శ్రీ మరోసారి వీరి కాంబో మ్యాజిక్ రిపీట్ చేస్తారని అంటున్నారు. పుష్ప 2లో శ్రీ లీల తో పాటుగా మరో హీరోయిన్ కూడా ఉంటుందని తెలుస్తుంది. అయితే స్పెషల్ సాంగ్ అప్డేట్ మాత్రం ఇప్పుడప్పుడే వదిలేలా లేరు చిత్ర యూనిట్.  ఈ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ తో పాటుగా బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.