Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ పై ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మేకర్స్.. పోస్టర్ కూడా వేశారు..!

Pushpa 2 12 Minites Scene Highlight for the Movie

Pushpa 2 12 Minites Scene Highlight for the Movie

రెండేళ్ల క్రితం రిలీజైన పుష్ప పార్ట్ 1 ది రైజ్ సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా సీక్వెల్ పై పాన్ ఇండియా లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. పుష్ప 2 (Pushpa 2) పై హోప్స్ పెంచుతూ ఆమధ్య సుకుమార్ వదిలిన టీజర్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

We’re now on WhatsApp : Click to Join

పుష్ప రాజ్ గా మరోసారి అల్లు అర్జున్ పూనకాలు తెప్పించేలా ఉన్నాడని టాక్. పుష్ప 2 సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. అయితే ఈ సినిమా రిలీజ్ పై డౌట్స్ మొదలయ్యాయి.

ఈ ఇయర్ సమ్మర్ మొదట్లో దేవర ఏప్రిల్ 5న రిలీజ్ అనుకున్నారు. అయితే ఆ సినిమా వాయిదా పడుతుందని తెలుస్తుంది. మే 9న ప్రభాస్ కల్కి రాబోతుంది. ఆ మూవీ కూడా దాదాపు వాయిదా బాట పడుతుందని టాక్. ఈ రెండు సినిమాల దారిలోనే పుష్ప 2 కూడా ఆగష్టు 15న రిలీజ్ కష్టమనే వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ చిత్ర యూనిట్ స్పందించింది.

సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ మరో పోస్టర్ వదిలారు. సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆగష్టు 15న వస్తుందని అంటున్నారు. పుష్ప 2 లో అల్లు అర్జున్ గంగమ్మ తల్లి అవతారంలో కనిపించే సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ సీన్ లోనే అల్లు అర్జున్ చేయి ఉన్న పోస్టర్ వదిలారు. ఆ చేతిలి నెయిల్ పెయింట్స్ వేసిన పుష్ప రాజ్ చెయ్యి చూసి పుష్ప ఫ్యాన్స్ లో ఉత్సాహం డబల్ అయ్యింది.

Also Read : Ashika Ranganath : సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ ఆప్షన్.. కన్నడ భామ లక్కీయెస్ట్..!