Site icon HashtagU Telugu

Pushpa 2 Release Date: అల్లు అర్జున్ “పుష్ప 2” రిలీజ్ ఎప్పుడంటే..?

Allu Arjun Pushpa 2

Pushpa2

Pushpa 2 Release Date: రెండు జాతీయ అవార్డుల రాకతో పుష్ప సీక్వెల్‌ పుష్ప 2పై అంచనాలు రెట్టింపయ్యాయి. అభిమానులతో పాటు సినీ ప్రేమికులంతా సీక్వెల్‌ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య రిలీజైన గ్లింప్స్‌ కి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. సినిమా ఎప్పుడొచ్చిన సూపర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. బన్నీ ఈ సారి వెయ్యి కోట్లు కొల్లగొట్టడం పక్కా అని ధీమాగా ఉన్నారు. అయితే సీక్వెల్‌కు సంబంధించిన రిలీజ్‌ డేట్‌ (Pushpa 2 Release Date)పై క్లారిటీ లేకపోవడంతో బన్నీ ఫ్యాన్స్‌ నిరాశలో ఉన్నారు.

అయితే .. ఈ సమయంలోనే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా విడుదల తేదీ బయటికొచ్చింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా చాలా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా విడుదల తేదీ దాదాపుగా పక్కాగా ఖరారైందని సమాచారం. 2024 మార్చి 22న మేకర్స్ సినిమా విడుదల ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

Also Read: Vivek Venkataswamy : కాంగ్రెస్ పార్టీ లోకి వివేక్ వెంకటస్వామి..?

ఎన్నో చర్చల అనంతరం పుష్ప టీమ్‌ ఈ డేట్‌ ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజైన ఫస్ట్‌ వీకెండ్ తర్వాత హోళి వస్తుంది. 29న గుడ్ ఫ్రైడేతో కలిపి మరో పెద్ద వీకెండ్ కలిసి వస్తుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.