Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ తోనే రికార్డ్ మోత మోగిస్తుందా.. 12వేల స్క్రీన్స్ అంటే రచ్చ రచ్చ..!

Nagababu Tweet About Pushpa 2

Pushpa The Rule

సుకుమార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వస్తున్న పుష్ప 2 రిలీజ్ ముందే సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాపై ఉన్న ఈ పాజిటివ్ క్రేజ్ కు మేకర్స్ అదే రేంజ్ ప్రమోషనల్ ప్లాన్ చేశారు. ఇండియా మొత్తం 7 మేజర్ సిటీస్ లో పుష్ప 2 ప్రమోషన్స్ చేయనున్నారు. దీనికి సంబందించిన అప్డేట్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ఇదిలాఉంటే డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా ఓవరాల్ గా 12 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని టాక్.

పాన్ ఇండియా (PAN India) లెవెల్ లో డిసెంబర్ 5న పుష్ప రాజ్ మేనియా చూపించేలా అత్యధిక థియేటర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దేశం మొత్తం మీదే కాదు ప్రపంచం మొత్తం మీద పుష్ప 2 ని ఎక్కువ స్కీన్స్ లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం 12 వేల థియేటర్స్ లో పుష్ప 2 (Pushpa 2) రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

12 వేల స్క్రీన్స్..

12 వేల స్క్రీన్స్ అంటే అది మామూలు విషయం కాదు. సినిమా ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కూడా ఒక రేంజ్ లో రికార్డులను సృష్టిస్తుందని చెప్పొచ్చు. సుకుమార్ (Sukumar) అల్లు అర్జున్ మాత్రం సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండేలా చూస్తున్నారు.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మరోసారి పుష్ప 2 తో తన మ్యూజిక్ టాలెంట్ చూపించడానికి సిద్ధమయ్యారు.

Also Read : Delhi Ganesh : ప్రముఖ నటుడు ఢిల్లీ గణేష్ కన్నుమూత..!