Site icon HashtagU Telugu

Pushpa 2 : ‘ప్రీమియర్స్’ టికెట్స్ అమ్మకాల్లో పుష్ప-2 రికార్డు

Pushpa Us

Pushpa Us

వరల్డ్ వైడ్ గా పుష్ప (Pushpa 2) మేనియా నడుస్తుంది. పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్..పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్ నేషనల్ ..ఇలా యావత్ సినీ ప్రేక్షకులు పుష్ప డైలాగ్స్ మాట్లాడుకుంటూ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆత్రుత తో ఉన్నారు. సుకుమార్ – అల్లు అర్జున్ కలయికలో తెరకెక్కిన పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఈ సినిమా తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాదు నేషనల్ అవార్డు సైతం దక్కించుకున్నాడు. రష్మిక అయితే నేషనల్ క్రాష్ అయిపోయింది. ఇలా ఈ సినిమాలో నటించిన నటీనటులే కాదు సాంకేతిక వర్గం వారు కూడా చాల ఫేమస్ అయ్యారు.

ఇక ఇప్పుడు యావత్ సినీ లోకం పుష్ప 2 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 05 న పుష్ప 2 వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో రికార్డు స్థాయి థియేటర్స్ లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో అమెరికాలో ప్రీమియర్ షోస్ తాలూకా టికెట్స్ బుకింగ్ ఓపెన్ కాగా..టికెట్స్ హాట్ కేకుల్లా సేల్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. డిసెంబర్ 4న అమెరికాలో ప్రీమియర్ టికెట్స్ దాదాపు 50,000 టికెట్లు క్షణాల్లో అమ్ముడు పోయాయి. ఇంత త్వరగా అమ్ముడైన సినిమా గా పుష్ప 2 రికార్డు నెలకొల్పింది.

ఇదిలా ఉంటె తాజాగా చెన్నై లో విడుదలైన పుష్ప 2 ఐటెం సాంగ్ పై విమర్శలు వస్తున్నాయి. మాములుగా సుకుమార్ మూవీస్ లలో ఐటెం సాంగ్ దుమ్ములేపుతుంది. అదికాక పుష్ప 1 లో ఊ కొడతావా..అంటూ ఓ ఊపు ఉపేయడంతో పుష్ప 2 లో ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అంత భావించారు కానీ నిన్న విడుదలైన ఈ సాంగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఫ్యాన్స్ సైతం దేవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : MLC Kavitha : తెలంగాణలో ‘కుల గణన’ కోర్టుల్లో నిలుస్తుందా.. సర్కారు చెప్పాలి : కవిత