అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 హంగామా మొదలైంది. సుకుమార్ డైరెక్షన్ లో సూపర్ హిట్ పుష్ప 1 సీక్వెల్ గా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా బడ్జెట్ విషయంలో నో కాంప్రమైజ్ అనేస్తున్నారు. పుష్ప 1 సాధించిన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్ప 2 ని దానికి డబుల్ క్రేజ్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇక సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ లాక్ చేయగా ఆ టైం కు రిలీజ్ చేసేలా అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఐతే రిలీజ్ కు 50 రోజులు ఉంది కాబట్టి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. పుష్ప 2 నుంచి లేటెస్ట్ గా 50 రోజులు మాత్రమే అంటూ ఒక క్రేజీ పోస్టర్ వదిలారు. పుష్ప రాజ్ కుర్చీలో కూర్చుని ఉన్న పోస్టర్ వదిలారు మేకర్స్.
పూనకాలు తెప్పించేందుకు రెడీ..
పుష్ప రాజ్ ఈసారి కూడా ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 పై ఉన్న బజ్ కి సుకుమార్ (Sukumar) కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప 2 (Pushpa 2) లో ఫాహద్ ఫాజిల్, సునీల్ నటిస్తున్నారు. సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అన్నై క్లారిటీ రాలేదు.
పుష్ప 2 రిలీజ్ కోసం రెండు రాష్ట్రాల ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మరి పుష్ప 2 ప్రభావం బాక్సాఫీస్ పై ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Also Read : Anirud Ravichandra : నాని శ్రీకాంత్ ఓదెల.. దేవరని దించేస్తున్నారుగా..!