Pushpa 2 Pre Release Event : మల్లారెడ్డి కాలేజీ లో పుష్ప 2 ప్రీ రిలీజ్ వేడుక

Pushpa 2 Pre Release Event : ఇప్పటికే చెన్నై , కొచ్చి లలో భారీ ఈవెంట్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్..ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరిపేందుకు సిద్ధం అయ్యారు

Published By: HashtagU Telugu Desk
Pushpa 2 Movie Released Overseas and North Before Telugu States

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. ఇప్పటికే చెన్నై , కొచ్చి లలో భారీ ఈవెంట్స్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసిన మేకర్స్..ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Pre Release Event) ను జరిపేందుకు సిద్ధం అయ్యారు. ముందుగా యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో వేడుక నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ..పోలీసులు అనుమతి నిరాకరించడంతో..మల్లారెడ్డి కాలేజీలో వేడుక కోసం పోలిసుల అనుమతి కోరగా..వారు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మధ్య చాల సినిమాల ఈవెంట్ లు మల్లారెడ్డి కాలేజీలో జరుగుతూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 కూడా అక్కడే జరిపేందుకు డిసైడ్ చేసారు. డిసెంబర్ 1న ప్రీరిలీజ్ వేడుక జరగనుంది.

ఇదిలా ఉంటె ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా నిడివి వచ్చేసి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు గా (Pushpa 2 Runtime) తేల్చేసారు. అలాగే సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు , డైలాగ్స్ కు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తుంది. ఓ అసభ్య పదాన్ని మ్యూట్‌ చేయమని సూచించగా ‘రండి’ అనే పదాన్ని మరొక పదంతో మార్చమని చెప్పింది. అలానే ఓ సన్నివేశంలో విలన్‌ కాలుని హీరో నరకగా అది గాలిలోకి ఎగిరే సీన్‌.. నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలంటూ చెప్పింది. ఇక ‘వెంకటేశ్వర్‌’ అనే మాటను భగవంతుడిగా మార్చమని సెన్సార్ బోర్డ్ సలహా ఇచ్చింది.

ఇక సినిమా అద్భుతంగా ఉందని , అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే అనిపించిందని , సుకుమార్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడని , నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రేంజ్ లో ఖర్చు చేసారని , వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని సెన్సార్ బృందం చెప్పుకొచ్చింది. క్లాస్ , మాస్ ఇలా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని , ఈ సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని , రష్మిక తో పాటు మిగతా నటి నటులంతా యాక్టింగ్ ఇరగదీశారని సెన్సార్ తెలిపింది.

Read Also : Rashmika Mandanna : పుష్ప 2 ప్రమోషన్స్ ఓ వైపు.. శ్రీవల్లి చీర అందాలు మరోవైపు..!

  Last Updated: 29 Nov 2024, 10:56 AM IST