Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2.. ఓవర్సీస్ రైట్స్ పై కన్నేసిన పుష్ప రాజ్..?

Is Vijay Devarakonda screening in Pushpa 3

Is Vijay Devarakonda screening in Pushpa 3

Pushpa 2 అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. సుకుమార్, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి మరోసారి మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఆగష్టు 15న పుష్ప 2 రిలీజ్ ఫిక్స్ చేయగా అనుకున్న డేట్ కి రిలీజ్ చేసేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో రెండు రోజులు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో లాంగ్ షెడ్యూల్ షురూ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా రెమ్యునరేషన్ విషయంలో అల్లు అర్జున్ భారీ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. పుష్ప 2 కోసం బన్నీ బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ ఆశిస్తున్నాడట. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడని తెలుస్తుంది. తన రెమ్యునరేషన్ గా ఓవర్సీస్ రైట్స్ ని అల్లు అర్జున్ అడుగుతున్నాడట.

పుష్ప 2 ఓవర్సీస్ రైట్స్ కోసం పోటీ జరుగుతుంది. పలు సంస్థలు ఓవర్సీస్ రైట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన రెమ్యునరేషన్ గా అల్లు అర్జున్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట. రెమ్యునరేషన్ లో కొంతభాగం అడ్వాన్స్ గా తీసుకోగా మరికొంత భాగం మాత్రం ఓవర్సీస్ రైట్స్ రూపంలో తీసుకుంటారని తెలుస్తుంది.

పుష్ప 2 కి ఉన్న బజ్ కి ఓవర్సీస్ లో భారీ డిమాండ్ ఉంది. తప్పకుండా ఆ లెక్కన చూస్తే అల్లు అర్జున్ కి గట్టి మొత్తంలో వర్క్ అవుట్ అయ్యేలా ఉందని చెప్పొచ్చు. సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి తమ మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉన్నారు.

Also Read : Niharika Konidela : ‘కోరిక’ తీర్చుకోవడం కోసమే రెండో పెళ్లి చేసుకుంటా – మెగా డాటర్ నిహారిక