Site icon HashtagU Telugu

Pushpa 2 OTT: పుష్ప 2 OTT లోకి వచ్చేది అప్పుడే..!!

Pushpa Us

Pushpa Us

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప 2 (Pushpa 2)నేడు వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పుష్ప 1 తో పోలిస్తే కథలో దమ్ము తగ్గినప్పటికీ సినిమా మొత్తం బన్నీ అదరగొట్టి వన్ మాన్ షో అనిపించుకున్నాడు. ప్రస్తుతం హౌస్ ఫుల్ తో రన్ అవుతున్న ఈ మూవీ తాలూకా ఓటిటి స్ట్రీమింగ్ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం పుష్ప 2 మేకర్స్ తో సుమారు రూ. 250 కోట్ల‌కు డీల్ సెట్ చేసుకున్న‌ట్లు సమాచారం. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్‌ సంక్రాంతి తర్వాతే ఉండవచ్చని తెలుస్తోంది.

థియేట్రిక‌ల్ ర‌న్ పూర్తైన త‌ర్వాత తమ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో అందుబాటులో ఉంటుంద‌ని నెట్‌ఫ్లిక్స్ తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది.

ఇక పుష్ప 2 మూవీ లో మైనస్ పాయింట్లు (Pushpa 2 Minus points) ఇవే అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

* సునీల్, అనసూయ పాత్రలు సాదాసీదాగా ఉండి తేలిపోయాయి.
* సినిమా ప్రారంభంలో జపాన్ ఎపిసోడ్, బాల్యంలోని సన్నివేశం తీసేసినా నిడివి కలిసివచ్చేది.
* షెకావత్ కు పువ్వు పంపించడం, తర్వాత ఇద్దరూ సంజ్ఞలు చేసుకుంటూ సాగిన సన్నివేశం వృథా అనిపిస్తుంది.
* శ్రీవల్లి పీలింగ్స్ పాటలో అందాలను చాలా ఎక్కువగా ఆరబోసింది. ఇది సుకుమార్ స్థాయి కాదు.
* పుష్పను పట్టుకోవడం కోసం ఇతర రాష్ట్రాల్లో కూడా పోలీసులుంటారుగా అనే ఆలోచన ప్రేక్షకులకు వస్తుంది. షెకావత్ ఒక్కడే కాదు కదా? అనే ప్రశ్నవారిలో తలెత్తింది.

* పుష్ప స్నేహితుడిగా నటించి జగదీష్ భండారీతో పాత్ర విధానం చెప్పిస్తే బాగుండేది. అది పుష్ప2లో లేదు.
* అల్లు అర్జున్ చెప్పే డైలాగులను చాలా శ్రద్ధగా వినాల్సి ఉంటుంది. లేకపోతే వెంటనే అర్థంకావు.
* ఫహద్ ఫాజిల్ అద్భుతమైన నటనను కనబరిచాడు. అయితే ఆ పాత్ర ముగించిన విధానం నచ్చలేదు.
* తారక్ పొన్నప్పది సాధారణమైన పాత్రలానే కనపడింది.
* మెగా ఫ్యామిలీపై కౌంటర్లు లేకుండా ఉంటే బాగుండేది. వీటిపై సుకుమార్ ఇంకాస్త శ్రద్ద పెడితే సినిమా టాక్ ఓ రేంజ్ లో ఉండేది.

Read Also : Retrofitted Handicapped Motor Vehicles: ఏపీలో దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాల పంపిణీ.. అర్హతలు ఏంటంటే?