అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుండగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను రీసెంట్ గా పాట్నాలో ఏర్పాటు చేశారు. నార్త్ లో పుష్ప 2 కి ఎలాంటి బజ్ ఉందో ఆ సినిమాకు వచ్చిన ఫ్యాన్స్ ని చూసి అర్ధమైంది. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ లకు సినిమాను ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా అందించాలనే ఉత్సాహం మరింత పెరిగేలా చేశారు ఆడియన్స్.
ఇక పుష్ప 2 సెకండ్ ఈవెంట్ ను ఈసారి చెన్నై (Chennai)లో ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ 24న చెన్నైలో పుష్ప 2 ఈవెంట్ ప్లాన్ చేశారు. తమిళనాడులోని తంబరం సాయిరాం ఇంజనీరింగ్ కాలేజ్ లోని లియో ముత్తు ఇండూర్ స్టేడియం లో ఈవెంట్ ప్లాన్ చేశారు. మొన్న పాట్నాలో నార్త్ ఆడియన్స్ సినిమాపై ఎంత ప్రేమ ఉందో చూపించారు.
ఈసారి సౌత్ గడ్డ మద్రాస్ అదే చెన్నైలో ఇది జరగబోతుంది. కోలీవుడ్ లో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నా అంత ఇంపాక్ట్ చూపించలేదు. ఒక్క బాహుబలి తప్ప మిగతా సినిమాలన్నీ ఏదో అలా అలా ఆడేశాయి. కానీ Sukumar పుష్ప 2 విషయంలో తమిళ తంబీల హృదయాలను కూడా గెలవాలని చూస్తున్నారు.
పాట్నాలో మాఇరిగా తమిళనాడులో కూడా ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయితే పుష్ప 2 రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ తర్వాత సిన్మాపై మరింత ఆసక్తి కలిగింది.
Also Read : Pushpa 2 : పుష్ప 2 కిసిక్ సాంగ్.. అందరు సిద్ధంగా ఉండండి..!