Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన మేకర్స్

Pushpa 2 Dec 6

Pushpa 2 Dec 6

పుష్ప 2 (Pushpa 2 ) రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన చేసి మేకర్స్ అభిమానుల ఉత్కంఠ కు తెరదించారు. సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లాభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) పేరే వినిపిస్తుంది..

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొన్నటి వరకు ఆగస్టు 15 న ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. షూటింగ్ ఆలస్యం కావడం..పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం తో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయడం లేదని ప్రకటించారు. దీంతో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని అంత భావిస్తుండగా..ఆ ఉత్కంఠ కు తెరదించారు మేకర్స్. సోమవారం సాయంత్రం సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు.

పుష్ప ది రూల్‌ను 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లాంఛ్ చేసిన కొత్త పోస్టర్‌లో కత్తి పట్టుకుని ఊరమాస్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు బన్నీ. 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ది రైజ్‌ గ్లోబల్ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది. మరి సీక్వెల్ కూడా ఇదే లైన్‌లో వెళ్తుందా.. అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Read Also : AP Assembly sessions : జూన్ 24 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు