Site icon HashtagU Telugu

Pushpa-2 Movie Ticket Prices: పుష్ప‌-2 మూవీ టిక్కెట్ల ధ‌ర‌లు భారీగా పెంపు.. ఎంతంటే?

Pushpa-2 Movie Ticket Prices

Pushpa-2 Movie Ticket Prices

Pushpa-2 Movie Ticket Prices: పుష్ప‌-2 మూవీకి తెలంగాణ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టిక్కెట్ల రేట్ల‌ను (Pushpa-2 Movie Ticket Prices) పెంచుకోవడానికి అనుమ‌తి ఇచ్చింది. ‘పుష్ప 2’ బెనిఫిట్ షోలకు అటు మల్టీప్లెక్స్, ఇటు సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేట్ మీద రూ.800లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు బెనిఫిట్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ షోలకు మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘పుష్ప 2’ టికెట్ రేటు రూ.1200లకు పైగా ఉండనుంది.

తెలంగాణలో ఒకరోజు ముందే పుష్ప ప్రీమియర్ షోస్ వేసుకోవటానికి తెలంగాణ ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.
ప్రీమియర్ షో టికెట్ రేటు రూ.800 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే డిసెంబర్ 4న రాత్రి 9:30 షోకు టికెట్ రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Also Read: Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8.. టైటిల్ రేసులో పోటా పోటీగా ఆ ఇద్దరు..?

మొదటి నాలుగు రోజులు

టిక్కెట్ల రేట్లు ఇంత భారీ స్థాయిలో పెరిగింది పుష్ప‌-2 మూవీకే కావడం విశేషం. ఇక‌పోతే పుష్ప మొద‌టి పార్ట్‌కు కొన‌సాగింపుగా వ‌స్తోంది పుష్ప‌-2. ఈ సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 5వ తేదీన ఈ మూవీ దాదాపు 11,000 థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. పుష్ప‌-2 మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించారు. పుష్ప‌-2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బిజినెస్ జ‌రిగింది విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తోన్న ఈ పుష్ప‌-2 మూవీలో ఫహాద్ ఫాజిల్, సునీల్‌, త‌దిత‌రులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పుష్ప‌-2లో శ్రీలీల కిస్సిక్ అనే ఐటెం సాంగ్‌లో ఆడిపాడింది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీపై ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇక‌పోతే ఓవ‌ర్‌సీస్‌లో డిసెంబ‌ర్ 4వ తేదీనే ఈ సినిమా ప్ర‌ద‌ర్శితం కానుంది. అల్లు అర్జున్ అభిమానులు సైతం ఈ మూవీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.