Site icon HashtagU Telugu

Pushpa 2: ఆగస్ట్ 15 డేట్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒకే తేదీకి ఏకంగా 12 కు పైగా సినిమాలు?

Mixcollage 03 Feb 2024 08 46 Am 999

Mixcollage 03 Feb 2024 08 46 Am 999

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా పుష్ప 2. భారీ అంచనాల నడుమ కోట్ల బడ్జెట్ తో బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీన వాయిదా వేశారు డిసెంబర్ లో విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినిపించగా మూవీ మేకర్స్ స్పందిస్తూ లేదు ఆగస్టు 15 విడుదల చేస్తాము విడుదల తేదీ విషయంలో ఎటువంటి మార్పు లేదు అని చెబుతూ క్లారిటీ ఇచ్చారు. ఆగస్టు 15 కి తగ్గేదే లేదు కచ్చితంగా అదే డేట్ కి విడుదల చేస్తాం అని బల్లగుద్ది మరి చెబుతున్నారు మూవీ మేకర్స్.

అయితే ఆగస్టు 15న పుష్ప సినిమా ఒకవేళ వాయిదా పడితే ఒకటి రెండు సినిమాలు కాదు ఏకంగా 12 కు సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్ట్ 15 నా అడ్డా అంటూ అందరికంటే ముందు ఖర్చీఫ్ వేసారు అల్లు అర్జున్. దానికి తగ్గట్లుగానే షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే పుష్ప 2 డిసెంబర్‌కు వాయిదా పడుతుందనే ప్రచారం ఈ మధ్య బాగానే జరుగుతుంది. అందుకే పంద్రాగస్ట్ కోసం భారీ సినిమాలన్నీ క్యూ కడుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీల్లో ఈ డేట్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. పుష్ప 2 వాయిదా పడదని నమ్మకంగానే చెప్తున్నారు నిర్మాతలు. ఒకవేల ఆ సినిమా వాయిదా పడితే, ఆ తేదికి ఒకటి రెండూ కాదు అరడజన్ సినిమాలు ఆ డేట్ కోసం క్యూ కడుతున్నాయి.

అందులో దేవర మూవీ ముందుంది. ఏపీ ఎలక్షన్స్ కారణంగా ఎప్రిల్ 5 నుంచి వాయిదా పడుతున్న ఈ చిత్రానికి ఆగస్ట్ 15 కంటే బెస్ట్ డేట్ 2024 మొత్తం వెతికినా దొరకదు. అలాగే నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న సరిపోదా శనివారం కూడా ఆగస్ట్ 15నే రావాలని చూస్తుంది. పుష్ప 2 రాకపోతే మేమొస్తామంటూ మేకర్స్ కూడా చెప్పేస్తున్నారు. దిల్ రాజు ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయబోతున్నారు. అలాగే తమిళం నుంచి కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు, రజినీకాంత్ వెట్టైయాన్, సూర్య కంగువా ఫోకస్ కూడా ఆగస్ట్ 15 పైనే ఉంది. అలాగే బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్‌గన్ సింగం అగైన్ సైతం ఆగస్ట్ 15నే రానుంది. ఈ డేట్ కూడా ఎప్పుడో కన్ఫర్మ్ చేసారు. పుష్ప 2 సహా అందరూ ఆగస్ట్ 15పై గురి పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. 4 రోజుల వీకెండ్‌తో పాటు ఆగస్ట్ 19న రక్షా బంధన్, 26న జన్మాష్టమి ఉన్నాయి. ఇవన్నీ కలెక్షన్లకు మరింత హెల్ప్ కానున్నాయి. ఆగస్టు పైనే అందరి చూపు పడింది. మరి పుష్ప 2 సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందా, తేదీకి వేరే సినిమాలు విడుదల అవుతాయో లేదో చూడాలి మరి. ఒకవేళ పుష్ప ఆగస్టు 15 బరిలో నుంచి తప్పుకుంటే మాత్రం సినిమాల జాతర అని చెప్పవచ్చు.