Pushpa 2 : అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా నార్త్ లో పెద్ద హిట్ అవ్వడం, పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచమంతా వైరల్ అవ్వడం, అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెరిగాయ్. దీంతో సుకుమార్ మరింత జాగ్రత్తగా చాలా ఆలస్యం చేసి మరీ పుష్ప 2 ని తెరకెక్కిస్తున్నారు.
గత సంవత్సరం డిసెంబర్ లో రావాల్సిన పుష్ప 2 ఈ సంవత్సరం డిసెంబర్ లో రాబోతుంది. డిసెంబర్ 6న పుష్ప 2 సినిమా రిలీజ్ చేస్తారని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. కానీ టాలీవుడ్ సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 5నే రిలీజ్ కాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఓవర్సీస్ లో, నార్త్ లో రిలీజ్ అయ్యాక చివరికి తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 రిలీజ్ అవుతుందట.
టాలీవుడ్ సమాచారం ప్రకారం పుష్ప 2 సినిమా డిసెంబర్ 4నే అమెరికాతో పాటు పలు ఓవర్సీస్ దేశాల్లో రిలీజ్ అవుతుందట. ఇక నార్త్ లో డిసెంబర్ 4 రాత్రి సెకండ్ షో ఆటతో రిలీజ్ చేస్తారంట. ఇది అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి ఒంటిగంట షోలతో పుష్ప 2 సినిమాని రిలీజ్ చేస్తారట. అది కూడా రెండు రాష్ట్రాల నుంచి పర్మిషన్స్ వస్తేనే. అయితే ఇటీవలే దేవర సినిమాకు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి పుష్ప 2 కు కూడా పర్మిషన్స్ ఇవ్వొచ్చని తెలుస్తుంది.
ఈ విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఓవర్సీస్ అంటే ఓకే కానీ నార్త్ లో ముందు రిలీజ్ చేసి ఇక్కడ తర్వాత రిలీజ్ చేయడమేంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక 1 AM షోలు వేస్తే నెగిటివ్ టాక్ లేదా మిక్స్‌డ్ టాక్ వస్తాయని ముందునుంచి ఉంది కాబట్టి ఆ విషయంలో కూడా భయపడుతున్నారు ఫ్యాన్స్. మరి పుష్ప 2 రిలీజ్ ఏ రేంజ్ లో ఎలా చేస్తారో చూడాలి.
Also Read : NTR : దేవర హిట్ అయినందుకు.. పెద్ద లెటర్ రాసి అందరికి థ్యాంక్స్ చెప్పుకొచ్చిన ఎన్టీఆర్..