పుష్ప 2 నుండి శ్రీలీల కిస్సిక్ సాంగ్ ప్రోమో (KISSIK Song – Promo) వచ్చేసింది. శ్రీలీల (Sree Leela) ..అంటే డాన్స్ ఐకాన్ అని ఎవరైనా అనాల్సిందే. మొదటి సినిమా నుండి మొన్నటి గుంటూరు కారం వరకు ఏ సినిమాలోనైనా డాన్స్ చించేసింది. కానీ సినిమాలే ఆ రేంజ్ లో చించలేకపోయాయి. ధమాకా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ భామ..ఆ తర్వాత వరుస సినిమాలు చేసింది. అతి తక్కువ టైములో ఎక్కువ సినిమాలు చేసిన భామగా గుర్తింపు తెచ్చుకుంది కానీ వాటిలో ఏ మూవీ కూడా విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నితిన్ సరసన రాబిన్ హుడ్ మూవీలో నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకంటే ముందే అల్లు అర్జున్ (Allu Arjun) తో చిందులేసిన పుష్ప 2 (Pushpa 2)రాబోతుంది.
పుష్ప 2 లో ఐటెం సాంగ్ లో బన్నీ తో కలిసి చిందులేసింది. ఇద్దరు టాలెంటెడ్ డాన్సర్లు కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేస్తుంటే చూడాలని అభిమానులు , సినీ ప్రముఖులు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సాంగ్ కు సంబదించిన ప్రోమో ను శనివారం మేకర్స్ విడుదల చేసారు. ఫుల్ సాంగ్ రేపు విడుదల చేయబోతున్నారు. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ సాంగ్ ను Lothika & Sublahshini పాడగా..Raqueeb Alam లిరిక్స్ అందించారు. దేవిశ్రీ మ్యూజిక్ చేసాడు. ప్రోమో మాత్రం కిస్ కిస్ అంటూ కుర్రకారుకు ఊపు తెప్పించింది. మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో ఊ..అనే రేంజ్లో ఉంటుందో..లేదో చూడాలి. అంతవరకు మీరు ఈ ప్రోమో ఫై లుక్ వెయ్యండి.
Read Also : AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రేసులో ముందున్నది ఎవరు అంటే.. ?