Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 కిసిక్ సాంగ్.. అందరు సిద్ధంగా ఉండండి..!

Srileela Pushpa2

Srileela Pushpa2

డిసెంబర్ 5న రిలీజ్ అవబోతున్న పుష్ప 2 సినిమా నుంచి ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అందిస్తుంది. పాట్నాలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తో నేషనల్ లెవెల్ లో పుష్ప 2 హాట్ టాపిక్ గా మారింది. (Allu Arjun) పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అవ్వగా లేటెస్ట్ గా థర్డ్ సాంగ్ కు సంబందించిన అప్డే రాబోతుంది. పుష్ప 2 సినిమా నుంచి స్పెషల్ సాంగ్ రిలీజ్ కాబోతుంది.

పుష్ప 1 లో ఉ అంటావా మావా సాంగ్ ని మించి ఉండేలా పుష్ప 2 (Pushpa 2) లో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు. కిసిక్ సాంగ్ గా వస్తున్న ఈ సాంగ్ ను యువ హీరోయిన్ శ్రీలీల (Srileela) స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. మామూలుగానే తన డ్యాన్స్ తో అదరగొట్టే శ్రీలీల ఈ సాంగ్ తో దుమ్ము దులిపేసేందుకు రెడీ అవుతుంది. పుష్ప 2 సినిమాలో కిస్క్ సాంగ్ ను నవంబర్ 23 సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

సుకుమార్ (Sukumar) సినిమాలో ఈ ఐటం సాంగ్స్ కు సెపరేట్ క్రేజ్ ఉంది. సినిమాకు వన్ ఆఫ్ ది హైలెట్ గా ఈ సాంగ్స్ ఉంటాయి. పుష్ప 1 లో ఉ అంటావా సాంగ్ కు ఏమాత్రం తీసిపోకుండా ఇంకా దాన్ని బీట్ చేసేలా ఈ కిసిక్ సాంగ్ ఉండబోతుందట. పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ కూడా తన బెస్ట్ ఇచ్చేస్తున్నాడు.

సినిమాకు పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న బజ్ కి తగినట్టుగానే ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి పుష్ప 2 సినిమా నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.

Also Read : Bhagya Sri : భాగ్య శ్రీకి భలే ఆఫర్ తగిలిందే..!