Site icon HashtagU Telugu

Pushpa 2 Item Song Leak : పుష్ప 2 ఐటెం సాంగ్ లీక్..శ్రీలీల మాములుగా లేదుగా..!!

Pushpa 2 Item

Pushpa 2 Item

Pushpa 2 Item Song Leak : పుష్ప 2 లోని ఐటెం సాంగ్ వీడియో బయటకు లీక్ అయినట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం అవుతూ..సాంగ్ తాలూకా స్క్రీన్ షాట్స్ కనిపిస్తున్నాయి. . సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో చెప్పాలిన పనిలేదు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతే కాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసిన అల్లు అర్జున్ (Allu Arjun) పేరే వినిపిస్తుంది.

ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.? కథలో ఎలాంటి ట్విస్ట్ లు ఉంటాయి.? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాను డిసెంబర్ 05 న ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నట్లు రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ లోని ఐటెం సాంగ్ ను రీసెంట్ గా రామోజీ ఫిలిం సిటీ లో పూర్తి చేసారు. పుష్ప లో ఐటెం సాంగ్ లో సమంత కనిపించగా..2 లో మాత్రం శ్రీ లీల కనిపించబోతుంది. కాగా ఈ సాంగ్ బయటకు లీక్ అయినట్లు తెలుస్తుంది.

దీనికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో లో అల్లు అర్జున్ తో కలిసి శ్రీలీల స్టెప్పులేస్తున్నట్లుగా ఇందులో కనిపించింది. బన్నీ డిఫరెంట్ కాస్ట్యూమ్తో కనిపిస్తుండగా శ్రీలీల హాట్ హాట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతమైతే వీడియో ఎక్కడ కనిపించకపోయినా..సాంగ్ తాలూకా స్క్రీన్ షాట్స్ మాత్రం దర్శనం ఇస్తున్నాయి.

Read Also : Rohit Sharma: టీమిండియాతో కలిసి రోహిత్ శర్మ ఆస్ట్రేలియా వెళ్తాడా? బిగ్ అప్డేట్ ఇదే!