Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!

Mytri Makers Producer Ravi Shankar about Pushpa 2

Mytri Makers Producer Ravi Shankar about Pushpa 2

Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు. పుష్ప పుష్ప రాజ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ ప్రోమో అంచనాలను పెంచేసింది. అంతేకాదు పుష్ప రాజ్ చిటికిన వేలుకి నెయిల్ పెయింట్ వేసి ఉండటం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

సుకుమార్ పుష్ప 2 అంచనాలకు తగినట్టుగానే తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ కూడా తన మార్క్ మ్యూజిక్ తో మరోసారి బాక్సులు బద్ధలు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ యాటిట్యూడ్ పాన్ ఇండియా లెవెల్ లో బీభత్సం సృష్టించింది. ఇప్పుడు పుష్ప 2 లో కూడా ఆ మేనియా కొనసాగించడం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో ఒకటైన పుష్ప 2 బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించాలని చూస్తున్నారు. ఈ సినిమా కోసం నార్త్ సైడ్ బిజినెస్ కూడా పీక్స్ లో జరుగుతుంది. పుష్ప 2 లో చాలా సర్ ప్రైజులు ఉన్నాయని సినిమా అంచనాలను మించే ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. పుష్ప 2 అంచనాలు చూస్తుంటే ఈ సినిమా ఫస్ట్ డేనే రికార్డ్ వసూళ్లను రాబట్టేలా ఉంది. తప్పకుండా పుష్ప 2 మరోసారి అల్లు అర్జున్ స్టామినా ప్రూవ్ చేస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.