Site icon HashtagU Telugu

Sukku – Allu Arjun : మొన్నటి వరకు తగ్గేదేలే అన్నారు..కానీ ఫైనల్ గా తగ్గారు

Sukumar Bunny

Sukumar Bunny

లెక్కల మాస్టర్ సుకుమార్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Sukumar-Allu Arjun) మధ్య విభేదాలు వచ్చాయని గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు తెగ చక్కర్లు కొడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 షూటింగ్ విషయంలో సుకుమార్ – బన్నీ కి మధ్య అభిప్రాయ విభేదాలు వచ్చాయని..అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్లిపోయారని..ఈ గ్యాప్ మూలాన డిసెంబర్ 06 న కూడా పుష్ప 2 (Pushpa 2) రావడం కష్టమే అని ప్రచారం జరిగింది. సుకుమార్ క్లారిటీ అంటూ పలు సన్నివేశాలు రీ షూట్ ల మీద రీ షూట్ లు చేయడం వల్ల నటి నటుల కాల్ షీట్స్ మారిపోతుండడం..సమయానికి వారు అందుబాటులో లేకపోవడం తో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుందని..బన్నీ సుకుమార్ ఫై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసాడట.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో సుకుమార్ బన్నీ ఫై కాస్త ఫైర్ అయ్యాడని..ఇలా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని ప్రచారం జరిగింది. ప్రస్తుతం మైత్రి నిర్మాతలు రంగంలోకి దిగి ఇద్దర్ని కూల్ చేశారట. మీ ఇద్దరి క్లాష్ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందని..సినిమా బడ్జెట్ కూడా విపరీతంగా పెరిగిపోతుందని చెప్పడం తో ఇద్దరు తగ్గారట. ప్రస్తుతం ఈ మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ ను మొదలుపెట్టారు. రామోజీ ఫిలిం సిటీ లో క్లైమాక్స్ సీన్ సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా..దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read Also : Nandamuri Mokshagna : జాన్వి చెల్లితో వారసుడి రొమాన్స్.. ప్లాన్ అదుర్స్..!

Exit mobile version