Tollywood Director : టాలీవుడ్ కొత్త విలన్ కాదండోయ్.. మన క్రియేటివ్ డైరెక్టర్.. గుర్తుపట్టారా..!

ఈ ఫొటోలో ఉన్నది టాలీవుడ్ కొత్త విలన్ కాదండోయ్. మన క్రియేటివ్ డైరెక్టరే గుర్తుపట్టారా..!

Published By: HashtagU Telugu Desk
Pushpa 2 Director Sukumar New Stylish Look Photo Gone Viral

Pushpa 2 Director Sukumar New Stylish Look Photo Gone Viral

Tollywood Director : ఇటీవల కాలంలో హీరోలతో పాటు దర్శకులు కూడా బాడీ ఫిట్‌నెస్, స్టైలిష్ లుక్స్ మెయిన్‌టైన్ చేస్తూ వావ్ అనిపిస్తున్నారు. ముఖ్యంగా తమ గడ్డం అండ్ హెయిర్ స్టైల్ తో బాయ్స్ కి స్టైల్ ఐకాన్ గా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ తన నయా లుక్ తో వావ్ అనిపిస్తున్నారు. అసలు ఆ లుక్ లో ఆ దర్శకుడిని గుర్తు పట్టడానికి కూడా కొంత సమయం పడుతుంది. మొన్నటి వరకు చాలా సింపుల్ లుక్స్ లో కనిపించిన ఆ దర్శకుడు.. ఒక్కసారిగా అల్ట్రా స్టైలిష్ లుక్ లోకి మారిపోవడంతో ఆడియన్స్ గుర్తు పట్టలేకపోతున్నారు.

ఇంతకీ ఫొటోలో కనిపిస్తున్న ఈ దర్శకుడు ఎవరో గుర్తు పట్టారా. ఈ దర్శకుడు మరెవరో కాదు, మన క్రియేటివ్ డైరెక్టర్, లెక్కల మాస్టర్ సుకుమార్. 20 ఏళ్ళు క్రిందట, కరెక్ట్ గా ఇదే రోజు (మే 7) ‘ఆర్య’ సినిమాతో దర్శకుడిగా సుకుమార్ తెలుగు ఆడియన్స్ కి పరిచయం అయ్యారు. అప్పుడు మొదలైన సుకుమార్ సినీ ప్రస్థానం.. నేడు పుష్పతో నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్ కి చేరుకుంది. ఆర్య కోసం పని చేసిన సుకుమార్, అల్లు అర్జున్, దిల్ రాజు.. ప్రస్తుతం తమతమ కెరీర్స్ లో పీక్ స్టేజిలో ఉన్నారు.

దీంతో ఈ 20 ఏళ్ళ జర్నీని ఒక రీ యూనియన్ పార్టీతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఇరవై ఏళ్ళ జర్నీ సెలబ్రేషన్స్ లో సుకుమార్ ఒక స్టైలిష్ ఫోటోషూట్ చేసారు. స్టైలిష్ హెయిర్ కట్, గడ్డం, కళ్లజోడుతో మోడల్ లా కనిపిస్తున్నారు. సుక్కు లుక్ చూస్తుంటే.. టాలీవుడ్ స్టైలిష్ విలన్ లా అనిపిస్తున్నారు. ఇక ఈ లుక్ చూసిన నెటిజెన్స్.. సుకుమార్ ని కూడా యాక్ట్ చేయమంటూ, యాక్టర్ గా మారిపోమంటూ సలహాలు ఇస్తున్నారు.

  Last Updated: 07 May 2024, 08:58 AM IST