Pushpa 2 Devi Nagavalli పుష్ప డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సెకండ్ పార్ట్ ని ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు సుక్కు. పుష్ప 1 పాన్ ఇండియా హిట్ గా నిలవగా పుష్ప 2 ని అంతకుమించి ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన టీజర్ హైప్ పెంచేసింది.
We’re now on WhatsApp : Click to Join
పుష్ప 2 కోసం సుకుమార్ ప్రతి విషయాన్ని చాలా డీటైల్డ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి హెల్ప్ తీసుకున్నారట సుకుమార్. సినిమాలో న్యూ రీడింగ్ అంశాలు ఉండటంతో అది ఎలా ఉండాలో తన ఆలోచన ప్రకారం దేవి నాగవల్లి నుంచి ఇన్ పుట్స్ తీసుకున్నారని తెలుస్తుంది.
ఈ క్రమంలో దేవి నాగ వల్లి కూడా పుష్ప 2 కి పనిచేసినట్టు తెలుస్తుంది. సుకుమార్ అసిస్టెంట్ గా పుష్ప 2 సినిమా కోసం దేవి నాగవల్లి కూడా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసినట్టు తెలుస్తుంది. తన జాబ్ ప్రొఫైల్ కి ఇబ్బంది లేకుండా తన షిఫ్ట్ టైమింగ్స్ అడ్జెస్ట్ చేసుకుని పుష్ప 2 సినిమా కోసం పనిచేస్తుందట దేవి నాగవల్లి.
Also Read : Priyanka Arul Mohan : విలన్ తో పవన్ హీరోయిన్ స్టెప్పులు..!