Site icon HashtagU Telugu

Pushpa 2: పుష్ప 2లో డైలాగ్‌ లీక్‌.. సోషల్‌ మీడియా షేకింగ్‌!

Pushpa 2

Pushpa 2

Pushpa 2: అల్లు అర్జున్‌ నటించిన పుష్ప మూవీ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం.. అంచనాలు లేకుండా గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. హిందీలో అయితే అసలు రిలీజ్ చేయొద్దని తొలుత భావించారట. కానీ అక్కడే సుమారు వంద కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్ సాధించింది. ప్రస్తుతం పుష్ప2 షూటింగ్‌ కోసం సర్వం సిద్ధమవుతోంది.

పుష్ప మూవీలో అల్లు అర్జున్ డైలాగులు, నటన, డ్యాన్స్, హావభావాలు ఎంతగానో ఇంపాక్ట్ చూపాయి. రష్మిక మంధాన హీరోయిన్ పాత్ర కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే తీశాడు సుకుమార్. ముఖ్యంగా తగ్గేదే ల్యా.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరూ… అంటూ అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు సినిమాకు చాలా ప్లస్ పాయింట్‌గా నిలిచాయి. ఇక పుష్ప2 సినిమాలోని పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది.

పుష్ప 2 సీక్వెల్‌ అయిన పుష్ప ది రూల్‌.. మూవీలో అంతకుమించి డైలాగులు ఉన్నాయట. ఈ విషయాన్ని ఇటీవలే ఇటీవలే హీరో అల్లు అర్జున్‌ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ నెట్టింట లీక్‌ అయినట్లు తెలుస్తోంది. అడవిలోని జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం.. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజ్‌ వచ్చాడని అర్థం.. అని డైలాగ్‌ ఉందట.

ట్రెండింగ్‌లో పుష్ప హ్యాష్‌ ట్యాగ్‌..

ప్రస్తుతం ఈ డైలాగ్‌ పేలిపోతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. డైలాగ్‌ సూపర్‌గా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. విపరీతంగా షేర్లు చేస్తూ హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. పుష్ప ది రూల్‌ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఇటీవలే పుష్ప మూవీకి ఫిలిం ఫేర్‌ అవార్డులు కూడా దక్కిన విషయం తెలిసిందే. ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు తీసుకున్న సందర్భంగా అల్లు అర్జున్‌.. పుష్ప2 మూవీలో ఇంతకు మించి డైలాగులుంటాయని చెప్పిన విషయం తెలిసిందే.