Site icon HashtagU Telugu

Pushpa 2 : పుష్ప 2 సెన్సార్ కట్స్ ..

Pushpa 2 Censor Cuts

Pushpa 2 Censor Cuts

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది. కాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు. అలాగే సినిమా నిడివి వచ్చేసి 3 గంటల 20 నిమిషాల 38 సెకన్లు గా (Pushpa 2 Runtime) తేల్చేసారు.

అలాగే సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు , డైలాగ్స్ కు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తుంది. ఓ అసభ్య పదాన్ని మ్యూట్‌ చేయమని సూచించగా ‘రండి’ అనే పదాన్ని మరొక పదంతో మార్చమని చెప్పింది. అలానే ఓ సన్నివేశంలో విలన్‌ కాలుని హీరో నరకగా అది గాలిలోకి ఎగిరే సీన్‌.. నరికిన చేతిని హీరో పట్టుకునే సన్నివేశాలను సీజీతో కవర్ చేయాలంటూ చెప్పింది. ఇక ‘వెంకటేశ్వర్‌’ అనే మాటను భగవంతుడిగా మార్చమని సెన్సార్ బోర్డ్ సలహా ఇచ్చింది.

ఇక సినిమా అద్భుతంగా ఉందని , అల్లు అర్జున్ యాక్టింగ్ తగ్గేదేలే అనిపించిందని , సుకుమార్ మరోసారి తనదైన స్క్రీన్ ప్లే తో అదరగొట్టాడని , నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ కూడా తగ్గేదేలే అనే రేంజ్ లో ఖర్చు చేసారని , వారు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని సెన్సార్ బృందం చెప్పుకొచ్చింది. క్లాస్ , మాస్ ఇలా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని , ఈ సినిమా తో అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని , రష్మిక తో పాటు మిగతా నటి నటులంతా యాక్టింగ్ ఇరగదీశారని సెన్సార్ తెలిపింది.

Read Also : Woman Commando With PM : ప్రధాని మోడీ వెంట మహిళా కమాండో.. ఫొటో వైరల్.. ఆమె ఎవరు?