Site icon HashtagU Telugu

Pushpa 2 : బాలీవుడ్ లో పిచ్చెక్కిస్తున్న పుష్ప 2 మేనియా

Pushpa-2 Movie Ticket Prices

Pushpa-2 Movie Ticket Prices

తెలుగు లోనే కాదు బాలీవుడ్ లోను పుష్ప 2 (Pushpa2)మేనియా కొనసాగుతుంది. సినిమా రిలీజ్ కు ఇంకా నాల్గు రోజులు ఉండగానే బుక్ మై షో (Pushpa 2 Book My SHow) వద్ద టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో 10 గంటల వ్యవధిలోనే 55,000 టికెట్లు అమ్ముడయ్యాయంటే పుష్ప క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పీవీఆర్​ ఐనాక్స్​, సినీపోలిస్​ వంటి నేషనల్​ థియేటర్​ చైన్​లలో రిలీజ్​ రోజు ఈ టికెట్స్ అమ్ముడుపోయాయి. బాలీవుడ్​ చరిత్రలో ఇంత వేగంగా టికెట్లు అమ్ముడుపోయిన అతికొద్ది సినిమాల సరసన పుష్ప-2 చేరింది. అడ్వాన్స్​ బుకింగ్స్​లో పుష్ప-2, యానిమల్, గదర్​-2ను దాటేసింది. అడ్వాన్స్​ బుకింగ్​ పరిస్థితి నాన్​ నేషనల్​ థియేటర్​ చైన్స్​, సింగిల్ స్క్రీన్​ థియేటర్లలో వేరే విధంగా ఉంది. టికెట్లు లైవ్​లోకి వెళ్లాక గంటల వ్యవధిలోనే హౌజ్​ఫుల్​ బోర్డులు పెడుతున్నారు. బుధవారం రాత్రి వరకు 5 లక్షల టికెట్లు సోల్డ్​ కావడమే లక్ష్యంగా పుష్ప-2 దూసుకెళ్తోంది. అలా 6 లక్షల మార్క్​ దాటితే ఏడేళ్ల బాహుబలి-2 రికార్డ్​ను పుష్పగాడు బద్దలుగొట్టడం ఖాయం.

ఇక తెలంగాణ (Telangana) విషయానికి వస్తే..

‘పుష్ప 2’ సినిమా టికెట్ ధరలు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు తొలి బెనిఫిట్ షో(Pushpa 2 Benefit show)తో పాటు, అర్ధరాత్రి 1 గంటలకు రెండో షో పడనుంది. అయితే ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 పెంచుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్‌ ఏదైనా సరే ఇప్పుడున్న ధరకు అదననంగా రూ.800 చెల్లించాల్సిందే. అంటే బెనిఫిట్​ షోకు టికెట్‌ ధర సింగిల్ స్క్రీన్స్​లో సుమారు రూ. 1000, మల్టీప్లెక్స్​లలో రూ.1200 పైగా అవుతోంది. పుష్ప తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 2న జరగనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఈవెంట్​కు హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. ఈ మేరకు ‘హైదరాబాద్​లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.

Read Also : Mokshagna : ఈనెల 5న మోక్షజ్ఞ-ప్రశాంత్ వర్మ మూవీ స్టార్ట్…