Site icon HashtagU Telugu

Pushpa 2 Audio Rights : పుష్ప 2 ఆడియో రైట్స్ రికార్డు.. ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

Fight with Pushpa Raj It is Very Risk

Fight with Pushpa Raj It is Very Risk

Pushpa 2 Audio Rights సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో భారీ అంచనాలతో రాబోతున్న సినిమా పుష్ప 2. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఆ సీక్వల్ ని ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమా విషయంలో ఆకాశమే హద్ధు అనిపించేలా చేస్తున్నారు. సుకుమార్ కూడా పుష్ప 2 పై అంచనాలతో వచ్చిన ఆడియన్స్ కు దాన్ని మించి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 సినిమా బిజినెస్ విషయంలో దుమ్ముదులిపేస్తుంది. ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం భారీ ఫైట్ జరుగుతుండగా లేటెస్ట్ గా సినిమా ఆడియో రైట్స్ మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో అమ్ముడైనట్టు తెలుస్తుంది. పుష్ప 2 ఆడియో రైట్స్ ను అన్ని భాషలకు గాను టీ సీరీస్ సంస్థ 60 కోట్లు ఇచ్చి దక్కించుకుందని తెలుస్తుంది.

సౌత్ సినిమా ముఖ్యంగా తెలుగు సినిమా ఆడియో రైట్స్ తో 60 కోట్లు డిమాండ్ చేయడం ఇదే మొదటిసారి. అలా కూడా పుష్ప 2 రికార్డ్ సృష్టించింది. పుష్ప 2 సినిమా నుంచి వచ్చే ప్రతి పోస్టర్, వీడియో అదిరిపోతుండగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం బాక్సాఫీస్ పై సత్తా చాటేలా ఉన్నాడు. పుష్ప 2 కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. మరి పుష్ప 2 ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.

Also Read : Actor Hospitalised: ఆసుప‌త్రిలో ప్ర‌ముఖ న‌టుడు.. ఆరోగ్య ప‌రిస్థితి ఎలా ఉందంటే..?