Site icon HashtagU Telugu

Pushpa 2 : 12 నిమిషాలు పూనకాలు తెప్పించడం పక్కానా..?

Pushpa 2 12 Minites Scene Highlight for the Movie

Pushpa 2 12 Minites Scene Highlight for the Movie

Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో రెండేళ్ల క్రితం వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోగా ఆ సినిమాలో పుష్ప రాజ్ పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా బీ టౌన్ ఆడియన్స్ బన్నీ ఫ్యాన్స్ గా మారారంటే అర్ధం చేసుకోవచ్చు. అందుకే పుష్ప పాన్ ఇండియా హిట్ అందుకుంది. ఇక రాబోతున్న పుష్ప 2 ని కూడా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నారట. సినిమాలో పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని టాక్.

ఇక సినిమాలో హైలెట్ సీన్స్ లో ఒకటి గంగమ్మ తల్లి జాతర అని తెలుస్తుంది. అల్లు అర్జున్ శారీ లుక్ లో ఇప్పటికే అఫీషియల్ పోస్టర్ వదలగా ఈమధ్యనే లీక్డ్ పిక్స్ లో కూడా అదే లుక్ తో ఉన్నాడు. రామోజి ఫిల్మ్ సిటీలో దాదాపు 40 రోజుల పాటుగా ఈ సీన్స్ షూట్ చేశారట.

సినిమాలో 12 సినిమాల సీన్ గా ఈ ఎపిసోడ్ ఉంటుందట. తప్పకుండా ఫ్యాన్స్ అందరికీ పూనకాలు తెప్పించేలా ఈ ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తుంది. పుష్ప 2 ప్రతి సీన్ ఒక గూస్ బంప్స్ స్టఫ్ గా సుకుమార్ తీర్చిదిద్దుతున్నాడని తెలుస్తుంది. ఇక మ్యూజిక్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ కూడా తన మాక్సిమం ఎఫర్ట్ పెట్టేస్తున్నాడని తెలుస్తుంది.

పుష్ప 2 నెవర్ బిఫోర్ అనిపించేలా మాస్ యాక్షన్ తో తెర మీద ఒక బీభత్సాన్నే సృష్టించబోతున్నాడట సుకుమార్. ఆగష్టు 15న రిలీజ్ ప్లాన్ చేస్తున్న పుష్ప 2 విషయంలో మేకర్స్ ఎక్కడ తగ్గట్లేదని తెలుస్తుంది.