Pushpa 2 : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’. మొదటి భాగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఈ సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ మూవీ ఆ తేదీకి రావడం కష్టమని, షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదని నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదట, చెప్పిన తేదీకే సినిమాని తీసుకు వచేస్తారట. జూన్ నెలాఖరుకు మొత్తం సినిమా షూటింగ్ అంతా పూర్తి అవుతుందట. మే నెలాఖురుకు అల్లు అర్జున్ కి సంబంధించిన టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అవుతుందట. కాగా మూవీలోని ఐటెం సాంగ్ ని ఇప్పటి వరకు చిత్రీకరించలేదట. సినిమా చిత్రీకరణ లాస్ట్ కి వచ్చినప్పుడు ఈ సాంగ్ ని షూట్ చేస్తారట. అప్పటివరకు ఈ సాంగ్ ని పక్కనపెట్టారట.
కాగా ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి చిందేయబోయే ఐటెం భామ ఎవరు అన్నది అందరిలో ఆసక్తిగా మారింది. మొదటి భాగంలో సమంత ‘ఊ అంటావా ఊఊ అంటావా’ అంటూ మాస్ ని ఒక ఊపు ఊపేసింది. దీంతో ఈ సెకండ్ పార్ట్ ఐటెం నెంబర్ లో ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. కాగా ఈ పాటలో బాలీవుడ్ భామ కనిపించబోతుందని, దిశా పటాని పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తుంది.
మరి ఫైనల్ గా ఏ బ్యూటీ పుష్పతో ఐటెం సాంగ్ చేస్తుందో చూడాలి. కాగా మూవీలో పెద్ద సిజి వర్క్ ఏమి లేదు కాబట్టి ఆగస్ట్ 15 విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని ఫిలిం వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
Also read : Teja Sajja : తేజ కొత్త సినిమాలో రితికా నాయక్ హీరోయిన్.. దర్శకుడు ఎవరంటే..!