Site icon HashtagU Telugu

Puri Jagannath Vs Raviteja : పూరీ వర్సెస్ రవితేజ.. ఫైట్ లో గెలిచేది ఎవరు..?

Interesting Title for Raviteja 75th Movie

Interesting Title for Raviteja 75th Movie

పుష్ప 2 (Pushpa 2) ఒక్కటి సైడ్ ఇచ్చే సరికి చాలా సినిమాలు ఆరోజు రిలీజ్ లాక్ చేసుకున్నాయి. ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ డౌట్ అని తెలిసిన నెక్స్ట్ మినిట్ రామ్ డబుల్ ఇస్మార్ట్ ని రిలీజ్ అనుకున్నారు. ఐతే అదే డేట్ కి ఇప్పుడు మాస్ మహరాజ్ రవితేజ కూడా వస్తున్నాడు. రవితేజ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాను కూడా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. మాస్ రాజా హరీష్ శంకర్ ఈ సూపర్ హిట్ కాంబో మరో హిట్ సినిమా అందించేందుకు వస్తున్నారు.

ఐతే ఈ ఫైట్ ఒక హీరో మరో డైరెక్టర్ అనేలా చెప్పొచ్చు. పూరీ జగన్నాథ్ సినిమాలతోనే రవితేజ (Raviteja) హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ సినిమాకే తన సినిమా పోటీగా వదులుతున్నాడు. రవితేజ వర్సెస్ పూరీ జగన్నాథ్ ఈ ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు.

ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న రామ్ పూరీ (Puri Jagannath) కాంబో మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో కూడా అదే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇక మిస్టర్ బచ్చన్ కూడా రవితేజ మార్ మాస్ ఎంటర్టైనర్ గా వస్తుంది. సో ఈ రెండు సినిమాలు మాస్ ఆడియన్స్ నే టార్గెట్ చేస్తూ వస్తున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రాం డబుల్ ఇస్మార్ట్ మధ్య జరిగే ఈ ఫైట్ లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి. ఈ రెండు సినిమాలతో పాటుగా మరో రెండు లో బడ్జెట్ సినిమాలు కూడా వస్తున్నాయి. కచ్చితంగా ఆగష్టు 15 థియేటర్లు అన్నీ కళకళలాడతాయని చెప్పొచ్చు.

రామ్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాల మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఐతే వీరిలో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారు అన్నది మాత్రం ఆరోజు తెలుస్తుంది.

Also Read : Nitin and Chaitanya : నితిన్, చైతన్య.. ఇపుడు ఏం చేస్తారు..?