Site icon HashtagU Telugu

Vijay Devarkonda: ‘జనగణమన’కు ఫుల్ స్టాప్ పడ్డట్లేనా..? విజయ్ వ్యాఖ్యల అర్థమేంటీ..?

Vijay Devarakonda

Vijay Devarakonda

టాలీవుడ్ క్రేజీ హీరో…విజయ్ దేవరకొండ. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబీనేషన్ లో తీయాలనుకున్న తన డ్రీమ్ ప్రాజెక్టు ‘జనగణమన’ నిలిచిపోయిందా.? లైగర్ మూవీ ప్లాప్ అవ్వడంతో పూరీ, చార్మిలు ఈ ప్రాజెక్టును పక్కనపెట్టారా అంటే విజయ్ దేవరకొండ తాజాగా చేసిన వ్యాఖ్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి.

సైమా వేడుకలకు హాజరైన విజయ్ ను మీడియా జనగణమన ఏమైందంటూ ప్రశ్నించింది. దీనికి స్పందిస్తూ…సైమా వేడుకలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాలని భావిస్తారు..కాబట్టి ఇక్కడ దానికి గుర్తించి ప్రస్తావన అవసరం లేదని సమాధానం చెప్పాడు. విజయ్ వ్యాఖ్యలు చూస్తుంటే..ఈ మూవీకి ఫుల్ స్టాప్ పడ్డట్టే అనే చర్చ మొదలైంది. జనగణమన లైవ్ లోనే ఉంటే విజయ్ ఈ వ్యాఖ్యలు చేసేవారు కాదంటురు.