Puri Jagannath : పూరీకి లక్ లేదు.. హరీష్ శంకర్ కి తిరుగు లేదు..!

Puri Jagannath మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉండగా ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చిరు హరీష్ శంకర్

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 09:02 PM IST

Puri Jagannath మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా సెట్స్ మీద ఉండగా ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత చిరు హరీష్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడని టాక్. సుంసిత కొణిదెల, పీపుల్ మీడియా ఫాక్టర్ వారు ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాతో హరీష్ శంకర్ మెగా డ్రీం ఫుల్ ఫిల్ అవుతుంది.

చిరుని డైరెక్ట్ చేయాలని కొన్నాళ్లుగా ఎంతోమంది దర్శకులు అనుకుంటున్నారు కానీ చిరు మాత్రం సెలెక్టెడ్ గా అవకాశాలు ఇస్తున్నారు. ఇదే క్రమంలో చిరుతో సినిమా కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు పూరీ జగన్నాథ్. చిరుతో ఆటో జానీ అనే సినిమా ఒకటి అనుకున్నాడు. ఫస్ట్ హాఫ్ అంతా కథ ఓకే కానీ సెకండ్ హాఫ్ బాగాలేదని చిరు ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టాడు.

అయితే ఎవరెవరితో సినిమాలు చేస్తున్నాడు కానీ పూరీ ని మాత్రం మెగాస్టార్ కన్సిడర్ చేయట్లేదు. ఆటో జానీ కథ కుదరకపోతే వేరే కథతో అయినా చిరుతో పూరీ సినిమా చేస్తే బెటర్ అని మెగా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి మెగా ఆఫర్ కోసం పూరీ ప్రయాస ఇంకా ఎన్నాళ్లు అన్నది చూడాలి.

పూరీ చిరు ఈ కాంబో మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. చిరుతో హరీష్ శంకర్ సినిమా చేస్తున్న ఈ టైం లో పూరీ అన్ లక్కీ హరీష్ శంకర్ వీరీ లక్కీ ఇక అతనికి తిరుగు లేదని అంటున్నారు.