Site icon HashtagU Telugu

Double Ismart : హమ్మయ్యా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలైందిలే.. ఈసారైనా కంప్లీట్ అవుతుందా..?

Puri Jagannadh Ram Pothineni Double Ismart Movie Schedule Starts

Puri Jagannadh Ram Pothineni Double Ismart Movie Schedule Starts

Double Ismart : ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్టుని అందుకున్న పూరి జగన్నాధ్, రామ్ పోతినేని.. మరోసారి సక్సెస్ ని అందుకోవడం కోసం ఇస్మార్ట్ కి సీక్వెల్ ని ప్రకటించి షూటింగ్ ని స్టార్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ‘డబుల్ ఇస్మార్ట్’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ మూవీని.. అట ఏడాది జులైలోనే స్టార్ట్ చేసారు. షూటింగ్ మొదలు పెట్టుకొని దాదాపు ఏడాది పూర్తి అవుతుంది. కానీ ఈ చిత్రం మాత్రం చిత్రీకరణ పూర్తి చేసుకోలేదు.

దీంతో మూవీ రిలీజ్ ని కూడా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. సినిమా షూటింగ్ చాలా త్వరగా పూర్తి చేసే పూరి.. ఈ సినిమాని మాత్రం ఇంత ఆలస్యం చేయడానికి గల కారణం ఆర్ధిక ఇబ్బందులే కారణమని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. వీరిద్దరూ గతంలో ‘లైగర్’ సినిమాని నిర్మించి ఆర్ధికంగా కొంచెం దెబ్బతిన్నారు. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ పై చూపిస్తుంది.

డబుల్ ఇస్మార్ట్ లో భారీ స్టార్ కాస్టింగే కనిపించబోతుందట. విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తుండగా కావ్య తాపర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. వీరితో పాటు ఫస్ట్ పార్ట్ లోని యాక్టర్స్ అండ్ మరికొంతమంది కొత్త స్టార్ట్ కాస్ట్ కూడా కనిపించబోతుంది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం ఇటీవల ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ వల్ల షూటింగ్ ని కొంతకాలం నిలిపివేయాల్సి వచ్చింది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ కి అన్ని అడ్డంకులు తీరిపోయాయి.

ఈ మూవీ లాస్ట్ షెడ్యూల్ ముంబై స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ మూవీలోని ప్రధాన తారాగణం అంతా పాల్గొనుందని సమాచారం. మరి ఈ షెడ్యూల్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకొని.. సినిమా రిలీజ్ కి సిద్ధమవుతోందా లేదా చూడాలి. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు.