Site icon HashtagU Telugu

Director Puri : డైరెక్టర్ పూరి గురించి ఆసక్తికర విషయాలు తెలిపిన తల్లి

Puri Mother

Puri Mother

డైరెక్టర్ పూరి జగన్నాధ్ (Director Puri Jagannadh)..అంటే తెలియని సినీ లవర్స్ లేరు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ ఈయన..పవన్ కళ్యాణ్ బద్రి తో ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా అడుగుపెట్టిన పూరి..ఆ తర్వాత ఇడియట్ , పోకిరి , బిజినెస్ మాన్ , దేశ ముదురు , శివమణి , ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఎంతో మందికి ఇచ్చి వారిని టాప్ హీరోల జాబితాలో చేర్చారు. అలాంటి పూరి..ఓ వ్యక్తి వల్ల దాదాపు రూ.100 కోట్లు పోగొట్టుకొని రోడ్డున పడే స్థితికి వచ్చాడు..ఇప్పటివరకు ఆ వ్యక్తి అనేది బయటివారికి తెలియనప్పటికీ..ఇండస్ట్రీ లో ఆ వ్యక్తి ఎవరో తెలుసు. అయితే డైరెక్టర్ గా మరకముందు ఇండస్ట్రీ లో ఎలాంటి కష్టాలు పడ్డాడో పూరి తల్లి (Ammaji ) తాజాగా ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

We’re now on WhatsApp. Click to Join.

తన కుమారుడు పడ్డ కష్టం ఎవరూ పడకూడదని చెపుతూ.. డిగ్రీ పూర్తయిన తర్వాత సినిమా పిచ్చితో హైదరాబాద్ వచ్చి ఆఫీసుల చుట్టూ తిరిగేవాడని , అసలు ఏడో తరగతి చదువుతున్నప్పుడు నుంచి సినిమాలంటే పిచ్చి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. దర్శకుడు కాకముందు ఒకసారి హైదరాబాద్ వెళ్తే అప్పుడు ఆయన కాళ్లు బాగా వాచిపోయి ఉన్నాయని సాక్సులు వేసుకోవడానికి కూడా కుదరడం లేదని ఆ పరిస్థితి చూసి తనకి ఏడుపొచ్చి ఏడ్చేసానని తెలిపింది. ఎందుకురా ఇంత కష్టం…ఊరు వచ్చేస్తే పొలం పని చేసుకుని బతుకుదాం కదా అంటే తాను రానని చెప్పాడని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ అయిన తర్వాత ఆయన దగ్గర పనిచేసే వ్యక్తి నమ్మించి దాదాపు రూ.100 కోట్లు కొట్టేసాడని ఆమె పేర్కొన్నారు. ఆ తర్వాత ఒక సినిమా వలన భారీగా నష్టం ఏర్పడడంతో కుటుంబం అంతా రోడ్డు మీదకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు ఆమె వెల్లడించారు. ఆ సమయంలో పూరీ కొనుక్కున్న ఐదు ఇళ్ళు అమ్మేశాడని పేర్కొన్నారు. మోసం చేసినవాడు ఎవరో తెలుసు, వాడి కాళ్లు విరిచేద్దామా అని స్నేహితుడు ఒకరు అంటే వద్దని వాడికి ఏ జన్మలోనా మనం రుణపడి ఉన్నాం కాబట్టి ఇలా జరిగింది అని సైలెంట్ అయ్యాడని అన్నారు. ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు కష్టపడతానని ఈ విషయం ఇక్కడితో వదిలేయాలని పూరి జగన్నాథ్ పేర్కొన్నాడని అమ్మాజీ చెప్పుకొచ్చారు. ఇక సాయం అడిగిన వారికి కూడా కాదనకుండా లక్షల్లో సాయం చేసేవాడని తన కుమారుడి గురించి అమ్మాజీ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పూరి..హీరో రామ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు.

Read Also : Naa Saami Ranga OTT : ‘నా సామిరంగ’ ఓటిటిలోకి వచ్చేస్తుందోచ్ ..