Site icon HashtagU Telugu

Mahesh Babu – Teja Sajja : మహేష్ నుంచి తేజ సజ్జ దగ్గరికి వచ్చిన ఆ సినిమా కథ..!

Puri Jagannadh Mahesh Babu Janaganamana Movie Script Is Went To Teja Sajja

Puri Jagannadh Mahesh Babu Janaganamana Movie Script Is Went To Teja Sajja

Mahesh Babu – Teja Sajja : సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకి వెళ్లిన ఓ కథ.. ఇప్పుడు తేజ సజ్జ చెంతకి చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన తేజ సజ్జ.. ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నారు. రీసెంట్ గా తన ‘హనుమాన్’ మూవీతో మహేష్ బాబు ‘గుంటూరు కారం’ని కొట్టి అదుర్స్ అనిపించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద మహేష్ ని ఓడించిన తేజ.. ఇప్పుడు ఏకంగా మహేష్ చేయాల్సిన సినిమానే చేసే అవకాశం అందుకుంటున్నాడట. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?

మహేష్ బాబు, పూరీజగన్నాధ్ కాంబినేషన్ ని మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, టాలీవుడ్ ఆడియన్స్ కూడా మర్చిపోరు. ఎందుకంటే ఈ కాంబోలో వచ్చిన సినిమాలు అలాంటివి. ‘పోకిరి’తో ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన ఈ కాంబో.. ‘బిజినెస్ మెన్’తో ఆడియన్స్ కి సరికొత్త కిక్ ఇచ్చారు. ఈ హిట్ కాంబోలో మరో మూవీ కూడా రావాల్సి ఉంది. పూరీజగన్నాధ్ తన డ్రీం ప్రాజెక్ట్ ‘జనగణమన’ని మహేష్ తో చేయాలని అనుకున్నారు. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు.

ఆ తరువాత ఆ సినిమాని విజయ్ దేవరకొండతో చేయడానికి పూరి రంగం సిద్ధం చేసారు. మూవీని గ్రాండ్ ఆ లాంచ్ కూడా చేసారు. కానీ ‘లైగర్’ ప్లాప్ తో అది ఆగిపోయింది. దీంతో పూరి డ్రీం ప్రాజెక్ట్ పరిస్థితి.. ఒక డ్రీం గానే మిగిలిపోయేలా అయ్యింది. కానీ పూరి మాత్రం పట్టు వదలని విక్రమార్కుడులా ఆ సినిమాని ఎలాగైనా తెరకెక్కించాలని కూర్చున్నారు. మహేష్, విజయ్ కాదంటే ఏంటి..? తేజ సజ్జతో ఆ సినిమా చేస్తానని పూరి అంటున్నారట.

ఆల్రెడీ తేజకి కథ కూడా వినిపించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి తేజ ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెబుతాడా లేదా చూడాలి. పూరి ప్రస్తుతం ‘డబల్ ఇస్మార్ట్’ చేస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ పై కూడా తేజ నిర్ణయం ఆధారపడి ఉంటుంది.