Ranbir Kapoor: యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్ బీర్ అద్భుతంగా నటించాడు. హీరోయిన్ రష్మిక తన పాత్రకి న్యాయం చేసింది. ఇదిలా ఉండగా యానిమల్ ద్వారా రణ్ బీర్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. దీంతో రణ్ బీర్ తదుపరి చిత్రం తెలుగు డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారట.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. ఆతర్వాత సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో చేసిన లైగర్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకుండానే మార్చి 8న రిలీజ్ అని ప్రకటించాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న డబుల్ ఇస్మార్ట్ అనౌన్స్ చేసిన డేట్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఇవ్వనున్నారు మేకర్స్.
అయితే.. డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరి సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు కానీ.. ఓ వార్త బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ముంబాయిలోనే ఉంటున్న పూరి.. ఇటీవల రణ్ బీర్ కపూర్ ను కలిశాడట. రణ్ బీర్ కపూర్, పూరి జగన్నాథ్ ఇద్దరి మధ్య సినిమాకు సంబంధించి మీటింగ్ జరిగిందని.. ఇద్దరూ రెండు గంటలు పాటు మాట్లాడుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త లీకైనప్పటి నుంచి రణ్ బీర్ – పూరి కాంబో మూవీ ఫిక్స్ అయ్యింది అంటూ ప్రచారం ఊపందుకుంది.
Also Read: Congress Manifesto Committee: లోక్‌సభ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీలో సీఎం సిద్ధరామయ్య