Site icon HashtagU Telugu

‘Double iSmart’ దెబ్బకు ప్రాప‌ర్టీలు అమ్ముతున్న పూరి..?

Director Puri Jagannadh

Director Puri Jagannadh

ఇటీవల సినిమాలు చేయడం అనేది ఓ పెద్ద సవాల్. హిట్ అయితే ఓకే..ప్లాప్ అయ్యిందో అంతే సంగతి. అప్పటివరకు సంపాదించిందంతా ఒకే దెబ్బకు పోగొట్టుకోవలసి వస్తుంది. అందుకే సినిమాలు నిర్మించడం అనేది ఇప్పుడు నిర్మాతలకు సవాల్ గా మారింది. చిత్రసీమలో ముగ్గురు , నలుగురు తప్ప నిర్మాతలు సినిమాలు చేయడం లేదు. ముఖ్యంగా పెద్ద హీరోలు , డైరెక్టర్లతో సినిమాలు అంటే నిర్మాతలు వణికిపోతున్నారు. ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ లు భారీ డిజాస్టర్లు అయ్యి..నిర్మాతలకు భారీ నష్టాలూ తెచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా డబుల్ ఇస్మార్ట్ (Double iSmart) దెబ్బకు పూరి (Puri) తన ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టాడనే వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఓ స్నేహితుడి కారణంగా వందల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న పూరి..ఆ తర్వాత సినిమాలు చేసి మళ్లీ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాలే పూరీని అప్పుల్లొకి నెట్టిస్తున్నాయి. లైగర్ దెబ్బకు సగం ఆస్తులు పోగొట్టుకున్న పూరి..ఇప్పుడు ఇస్మార్ట్ దెబ్బకు మిగతా ఆస్తులు కూడా అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. త‌న సినిమా హిట్ట‌యి డ‌బ్బులొస్తే, దాన్ని ప్రాప‌ర్టీలుగా మార్చ‌డం పూరికి అల‌వాటు. ఫ్లాప్ అయితే ఆ ప్రాప‌ర్టీని అమ్మ‌డం చేస్తుంటాడు.

ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ దెబ్బకు అలాగే చేస్తున్నాడు. ‘డ‌బుల్ ఇస్మార్ట్’ విడుద‌లకు ముందు రోజు పూరి ఆఫీసులో పెద్ద పంచాయితీ న‌డిచింది. పాత అప్పులు క్లియ‌ర్ చేయాల్సివ‌చ్చింది. దాంతో షంషాబాద్ ప్రాప‌ర్టీని అప్ప‌టికప్పుడు రూ.18 కోట్ల‌కు అమ్మేయాల్సి వచ్చిందట. ఆ తర్వాత ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ని నైజాంలో విడుద‌ల చేసిన నిరంజ‌న్ రెడ్డి భారీగా న‌ష్ట‌పోయాడు. ఆ డ‌బ్బుల్ని కూడా పూరి తిరిగి ఇవ్వాల్సి వస్తుందట. అందుకోసం పూరి మ‌రో ప్రాప‌ర్టీ తాక‌ట్టు పెట్ట‌బోతున్న‌ట్టు స‌మాచారం. మొత్తం మీద పూరికి సినిమాలు ఏమాత్రం కలిసి రావడం లేదంటేది సత్యం. పూరి తో సినిమాలు చేసేందుకు ఇతర నిర్మాతలు ముందుకు రాకపోవడం తో సొంతగా నిర్మిస్తూ..వస్తున్నాడు. దీంతో ఉన్న ఆస్తులు పోగొట్టుకోవాల్సి వస్తుంది.

Read Also : Chalo Delhi : 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..?