Site icon HashtagU Telugu

Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

Punjabi Cremation

Punjabi Cremation

Punjabi Cremation: బాలీవుడ్ ప్రసిద్ధ దిగ్గజ నటుడు ధర్మేంద్ర 89 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ‘హీ-మ్యాన్’గా గుర్తింపు పొందిన ఈ న‌టుడు మరణంతో దేశమంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ధర్మేంద్ర కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొద్ది రోజులు చేర్చారు. ఆ తరువాత డాక్టర్ల పర్యవేక్షణలో ఆయనకు ఇంట్లోనే చికిత్స కొనసాగించారు. ధర్మేంద్ర పంజాబీ కావడంతో పంజాబీల (Punjabi Cremation)లో అంత్యక్రియలు ఎలా జరుగుతాయో? హిందువుల ఆచారాల నుండి అవి ఎంతవరకు భిన్నంగా ఉంటాయో తెలుసుకుందాం.

పంజాబీలలో అంత్యక్రియలు కేవలం ప్రియమైన వ్యక్తికి వీడ్కోలు చెప్పే ప్రక్రియ మాత్రమే కాదు. గౌరవం, పవిత్రత, ఆధ్యాత్మిక విశ్వాసాలతో వారిని తుది గమ్యానికి చేర్చే ప్రశాంతమైన, గౌరవప్రదమైన ప్రయాణం. ముఖ్యంగా సిక్కు సమాజంలో ఈ ప్రక్రియ హిందూ సంప్రదాయాల నుండి అనేక విధాలుగా భిన్నంగా కనిపిస్తుంది.

మొదటి దశ

మొదటగా మృతదేహాన్ని సిద్ధం చేయడం గురించి తెలుసుకుందాం. సిక్కు సంప్రదాయాలలో మరణానంతరం మృతదేహాన్ని అత్యంత గౌరవంగా స్నానం చేయిస్తారు. ఆ తరువాత మరణించిన వ్యక్తికి అతని ఐదు కకారాలైన (పంచ కకారాలు) కేశ్ (జుట్టు), కంగ (దువ్వెన), కారా (కడియం), కృపాణ్ (ఖడ్గం), కచ్చా (అండర్‌వేర్)తో అలంకరిస్తారు. ఈ పవిత్ర చిహ్నాలతో కూడిన అంతిమయాత్ర ఆ వ్యక్తి ధార్మిక గుర్తింపును పూర్తి చేస్తుందని నమ్ముతారు. అంత్యక్రియల్లో మతపరమైన చిహ్నాలు లేదా ప్రతీకలను ఉపయోగించడం ప్రాంతం, సమాజం ప్రకారం మారుతుంటుంది. కాబట్టి. ఈ సంప్రదాయం హిందూ ధర్మం నుండి భిన్నంగా ఉంటుంది.

Also Read: Dharmendra Pension: ధర్మేంద్ర మృతి.. ఆయ‌న‌ పెన్షన్ ఎవరికి దక్కుతుంది?

రెండ‌వ ద‌శ‌

మృతదేహాన్ని సిద్ధం చేసిన తర్వాత రెండవ ముఖ్యమైన దశ గురుద్వారాలో చేసే ప్రార్థనలు. ఇక్కడ ‘అర్దాస్’, ‘జప్‌జీ సాహిబ్’, ‘కీర్తన్ సోహిలా’ వంటి పాఠాలు చదువుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యులు, సమాజం ప్రజలు ఏకమై, మరణించినవారి ఆత్మ శాంతి కోసం ప్రార్థిస్తారు. కొన్నిసార్లు గురుద్వారాలో పాఠం పూర్తయిన తర్వాతే మృతదేహాన్ని అంతిమయాత్ర కోసం తరలిస్తారు.

అర్తి యాత్ర

పంజాబీల అంతిమయాత్ర కూడా చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. మృతదేహాన్ని పువ్వులతో అలంకరించిన అర్తిపై ఉంచుతారు. బంధువులు, తెలిసినవారు వెనుక నడుస్తూ ‘వాహేగురు’ నామాన్ని జపిస్తారు. ఈ జపం వాతావరణంలో ఒక ఆధ్యాత్మిక శాంతిని, స్థైర్యాన్ని నింపుతుంది. ఈ సంప్రదాయం హిందూ అంతిమయాత్రతో కొంతవరకు పోలి ఉన్నప్పటికీ సిక్కు సమాజంలో మహిళలు కూడా బహిరంగంగా అంతిమయాత్రలో పాల్గొనవచ్చు. ఇది అనేక హిందూ కుటుంబాలలో ఇప్పటికీ సాధారణం కాదు.

దహన సంస్కారం

శ్మశాన వాటికకు చేరుకున్న తర్వాత మృతదేహాన్ని దహనం చేస్తారు. సిక్కు ధర్మంలో అగ్ని-సంస్కారాన్ని తుది వీడ్కోలుకు ప్రధాన మార్గంగా భావిస్తారు. ఎందుకంటే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి దేవునిలో విలీనమవుతుందని ఇక్కడ నమ్ముతారు. దహనం తర్వాత కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి స్నానం చేస్తారు. దీనితో పాటు పది రోజుల మతపరమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది, ఇందులో గురు గ్రంథ్ సాహిబ్ అఖండ పాఠం లేదా క్రమమైన పఠనం కొనసాగుతుంది. ప్రతి సాయంత్రం పాఠం పూర్తయిన తర్వాత కడ్హా ప్రసాద్ (తీపి ప్రసాదం) పంపిణీ చేస్తారు.

10 రోజులు కీర్తనలు

ఈ పది రోజుల పాటు ఇంట్లో కీర్తనలు, పారాయణం ఆగవు. ఈ పారాయణం ఇంట్లో సానుకూల శక్తిని నిలబెట్టి దుఃఖంలో ఉన్న కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. చివరి రోజు ‘భోగ్’ సమర్పిస్తారు. దీనిని సంస్కారాల ముగింపుగా భావిస్తారు. దహనం తర్వాత అస్థికల నిమజ్జనం కూడా చాలా సరళంగా, పవిత్రతతో చేస్తారు. అస్థికలను పారే నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఇక్కడ కూడా ఎటువంటి ఆర్భాటం లేదా భారీ పూజా కార్యక్రమాల ఆచారం లేదు.

Exit mobile version