పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) కలిసి నటించిన బ్రో సినిమా జులై 28న థియేటర్స్ లో రిలీజయి భారీ విజయం సాధించింది. బ్రో సినిమా ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించి ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. బ్రో సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర వివాదంగా మారిన సంగతి తెలిసిందే.
వైసీపీ నేత అంబటి రాంబాబు(Ambati Rambabu) గతంలో సంక్రాంతికి రోడ్డు మీద డ్యాన్సులు వేయగా ఆ వీడియో వైరల్ అయింది. అదే డ్యాన్స్, అదే డ్రెస్ తో బ్రో సినిమాలో శ్యాంబాబు పాత్రని డిజైన్ చేయడంతో మంత్రి అంబటికి ఇది కౌంటర్ అని అంతా భావించారు. దీనిపై అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు, జనసేన అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ పాత్ర పోషించిన నటుడు పృథ్విరాజ్(Prudhvi Raj) ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత పెద్దగా చేసాడు.
తాజాగా నేడు ‘బ్రో’ సినిమా సక్సెస్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో నటుడు పృథ్విరాజ్ మాట్లాడుతూ.. డైరెక్టర్ మంచి కథని సినిమాగా అందిస్తే దాని గురించి మాట్లాడకుండా అందరూ నా క్యారెక్టర్ గురించి అడుగుతున్నారు. నా శ్యాంబాబు పాత్ర బాగా వైరల్ అయి నాకు మరింత మైలేజ్ తెచ్చిపెట్టింది. నన్ను చాలా మంది అడిగారు అది ఏపీ మంత్రి రాంబాబు క్యారెక్టర్ నుంచి తీసుకొని చేశారా అని. అసలు నాకు అంబటి రాంబాబు ఎవరో తెలీదు. అతను ఏమైనా ఆస్కార్ నటుడా అతన్ని ఇమిటేట్ చేయడానికి. నాకు డైరెక్టర్ బార్ లో తాగుతూ ఎంజాయ్ చేసే పాత్ర అని చెప్పారు, నటుడిగా ఆ పాత్ర చేశాను అంతే అని అన్నారు.
దీంతో ఇప్పుడు పృథ్విరాజ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అయితే పృద్వి గతంలో వైసీపీలో ఉంది బయటకి వచ్చాడు. దీంతో పృద్వి వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరింత చర్చగా మారాయి.
Also Read : Bro Collections : అదరగొడుతున్న ‘బ్రో’ కలెక్షన్స్.. పవన్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్లు..