Site icon HashtagU Telugu

Prudhvi Raj : నేను సినిమా స్టేజీలపై మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారుగా.. అందుకే ఇక నుంచి ట్విట్టర్లో..

Prudhvi Raj says no more Political Comments on Movie Stages Tweet goes Viral

Prudhvi Raj

Prudhvi Raj : 30 ఇయర్స్ పృథ్విరాజ్ అప్పుడప్పుడు రాజకీయాలతో వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. గతంలో వైసీపీలో ఉన్న పృథ్విరాజ్ ప్రస్తుతం జనసేనకు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో రాజకీయాలు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ క్రమంలో పలు సినిమా ఈవెంట్స్ లో అనుకోకుండా అప్పుడప్పుడు రాజకీయాలు మాట్లాడటంతో విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో పృథ్విరాజ్ సినిమా గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేసారు. అయితే అవి ఏ పార్టీని ఉద్దేశించి చేయకపోయినా ఆయన మాట్లాడిన దాంట్లో 11 అని నెంబర్ ఉండటంతో గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తులు పృథ్విరాజ్ పై, లైలా సినిమాపై తీవ్ర విమర్శలు ట్రోల్స్ చేసారు. సోషల్ మీడియాలో పృథ్విరాజ్, విశ్వక్, లైలా సినిమాని టార్గెట్ గా విమర్శించారు. దీనికి సంబంధం లేకపోయినా విశ్వక్ సారీ చెప్పాల్సి వచ్చింది. పృథ్విరాజ్ కూడా సినిమాకు ఎఫెక్ట్ అవ్వొద్దు అని సారీ చెప్పి తనని, తన కుటుంబాన్ని భూతులతో ట్రోల్ చేసిన వారిని వదిలిపెట్టను అని హెచ్చరిక జారీ చేసారు.

ఈ పరిమాణాలన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా పృథ్విరాజ్ ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి.. హాయ్ నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విరాజ్. నేను అధికారికంగా ట్విట్టర్లోకి వచ్చాను. నేను నా భావాలను స్టేజ్ పైన ప్రకటిస్తుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు నుండి ఈ X అనే వేదిక ఉపయోగించుకుని నా భావ ప్రకటన స్వేచ్చని తెలియపరుస్తాను అని తెలిపారు.

దీంతో ఇకపై పృథ్విరాజ్ సినిమా ఈవెంట్స్ లో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ రాజకీయాల గురించి మాట్లాడను అని క్లారిటీ ఇచ్చేసాడు. మరి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ట్వీట్స్ వేస్తాడో, దానికి వైసీపీ సోషల్ మీడియా ఏ రేంజ్ లో ట్రోల్ చేస్తుందో చూడాలి.

 

Also Read : Chiranjeevi : చిరంజీవి చేతుల మీదుగా ‘మాస్టర్ ఆఫ్ సస్పెన్స్ హిచ్‌కాక్’ సెకండ్ ఎడిషన్ లాంచ్..