Prabhas Project K: అంచనాలు పెంచేస్తున్న ‘ప్రాజెక్ట్ కే’.. దీపిక లుక్ రివీల్!

పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టు కే అంచనాలు పెంచేస్తోంది. దీపికా స్పెషల్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.

  • Written By:
  • Updated On - January 5, 2023 / 02:59 PM IST

ప్రస్తుతం పాన్ మూవీస్ హవా కొనసాగుతోంది. ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కె (Project K) కూడా సినిమా కూడా ఉంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), బాలీవుడ్ హీరోయిన్ దీపికా నటిస్తుండటమే ఇందుకు కారణం. ప్రాజెక్ట్ కే సినిమాలో ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా (Deepika) పదుకునే నటిస్తున్న విషయం తెల్సిందే. నేడు ఆమె పుట్టిన రోజు సందర్బంగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ఒకటి రివీల్ చేశారు.

అందులో దీపికా (Deepika) లుక్ ను రివీల్ చేయలేదు కానీ ఆమె ఔట్ ఫిట్ ఇలా ఉంటుందనే ఒక ఐడియా ఇచ్చారు. డార్క్ షేడ్ లో ఉన్న ఆ ఫోటో చూస్తూ ఉంటే చాలా కొత్త ఆలోచనలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ కే (Project K) కు సంబంధించిన దీపికా పదుకునే బర్త్ డే పోస్టర్ కు రకరకాలుగా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పోస్టర్ ను చూస్తూ ఉంటే ఇదేదో హాలీవుడ్ సూపర్ హీరోస్ సినిమా మాదిరిగా ఉండబోతుంది అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

దీపికా ను కూడా నెవ్వర్ బిఫోర్ అన్నట్లుగా ఈ సినిమాలో చూడబోతున్నామనే నమ్మకంను ఆమె అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్, దీపికా  కాంబో కు కచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంను ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాకు (Project K) సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

Also Read: Sharwanand: యూఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్న శర్వానంద్!