Site icon HashtagU Telugu

Project K Story: ప్రభాస్ “కల్కి 2898 ఏడీ” మూవీ స్టోరీ ఇదేనా..?

Project K Story

742078409 Project K Is Titled Kalki 2898 Ad Cover

Project K Story: ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నప్రాజెక్ట్ కె (Project K Story) టైటిల్‌, గ్లింప్స్‌ వచ్చేశాయి. ఈ చిత్రానికి “కల్కి 2898 ఏడీ” (Kalki 2898 AD)’ అనే టైటిల్‌ ఫైనల్‌ చేశారు. ఇంతకి “కల్కి” అంటే ఏంటన్న చర్చ మొదలైంది. కలియుగం చివర్లో విష్ణువు పదో అవతారమే కల్కి అని పురాణాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని చీకటి కమ్మేసినప్పుడు శక్తిలా కల్కి ఉద్భవిస్తుందని అందులో ఉంది. కలియుగం అంతంలో జరిగే కథా నేపథ్యంలో ఈ చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది.

ప్రాజెక్ట్ కె సినిమా టైటిల్, గ్లింప్స్ ను శాన్ డియాగోలోని కామిక్ కాన్ వేడుకలో శుక్ర‌వారం తెల్ల‌వారుజామున‌ విడుదల చేశారు. కొన్ని దుష్టశక్తులు ప్రజలను బందీలను చేస్తే వారిని రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ ను చూపించారు. యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. విజువల్ ఎఫెక్ట్ కూడా హాలీవుడ్ రేంజ్ లో ఉన్నాయి. ప్రభాస్ ఎంట్రీ అద్భుతంగా ఉంది. చివ‌రిలో ‘వాట్ ఈజ్ ప్రాజెక్ట్ కె’ అని ఓ వ్యక్తి అడగ్గా వెంటనే టైటిల్ రివీల్ చేశారు.

Also Read: Allu Arjun Leaks Dialogue: ‘పుష్ప 2’ సినిమాలో డైలాగ్‌ని లీక్ చేసిన అల్లు అర్జున్‌.. క్షణాల్లో వీడియో వైరల్..!

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకొణె, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్ లో కమల్ పాత్రకు సంబంధించి ఏదీ రివీల్ చేయలేదు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇక సూపర్‌ హీరోగా ప్రభాస్‌ ఎంట్రీ, లుక్‌ నెక్ట్స్‌ లెవెల్‌లో ఉంది. ‘వాటీజ్‌ ప్రాజెక్ట్‌- కె’ అనే డైలాగ్‌తో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. ఇక దీపికా పదుకొణె క్యారెక్టర్‌ కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. మహానటి తర్వాత నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తోన్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా అమెరికాలో జరుగుతోన్న శాన్‌డియాగో కామిక్‌ కాన్‌ ఫెస్టివల్‌లో మేకర్స్ ప్రాజెక్ట్‌ కే గ్లింప్స్‌, టైటిల్‌ను రిలీజ్‌ చేశారు.