Site icon HashtagU Telugu

Deepika Padukone: ‘ప్రాజెక్ట్‌ కె’ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్‌ లుక్‌ వచ్చేసింది..!

Deepika Padukone

Resizeimagesize (1280 X 720)

Deepika Padukone: ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’ (వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమాలో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర బృందం తాజాగా ఆమె ఫస్ట్‌లుక్‌ని సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ సినిమా టైటిల్‌ ఎప్పుడు చెబుతారా? అని ఎదురుచూస్తున్న వారికి అతి త్వరలోనే సమాధానం లభించనుంది.

ఈ నెల 20న ప్రారంభం కానున్న ‘శాన్‌ డియాగో కామిక్‌ కాన్‌’ వేడుకల్లో చిత్ర బృందం పాల్గొని టైటిల్‌, ట్రైలర్‌ను విడుదల చేసి, సినిమా రిలీజ్‌ డేట్‌ని చెప్పనుంది.‘‘ఈ ప్రపంచం మొత్తం అత్యంత ఆసక్తికర షో కోసం వేచి చూస్తోంది. ప్రాజెక్ట్‌-కె ప్రపంచాన్ని పరిచయం చేసుకునేందుకు మీరు సిద్ధంగా ఉండండి. జులై 20 (యూఎస్‌ఏ) జులై 21 (ఇండియా)’’ అని చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం తెలిపింది. కామిక్‌ కాన్‌ వేదికపై ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్‌ కె’ చరిత్ర సృష్టించనుంది.

Also Read: Maggi Cost in Airport : ప్లేట్ మ్యాగీ ఏకంగా 193 రూపాయలు.. బిల్ చూసి ఆశ్చర్యపోయిన యూట్యూబర్..

ఈనెల 20న శాన్ డియాగో కామిక్ కాన్‌లో జరిగే ఈ వేడుకకు ప్రభాస్, కమలహాసన్, దీపికా పదుకొణే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు. భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.