Site icon HashtagU Telugu

Mirai Movie: ‘మిరాయ్’ తో నిర్మాతకు ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయో తెలుసా..?

Mirai Movie Records

Mirai Movie Records

తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్(Mirai ) బాక్సాఫీస్ వద్ద నిజంగా రఫ్ఫాడిస్తోంది. డే 1 నుంచే భారీ ఓపెనింగ్స్ సాధించి, రెండో రోజుకే రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వెళ్లడం నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు ఊహించని సంతోషం ఇచ్చింది. ఐదో రోజుకే రూ.100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఈ సినిమా, 16 రోజుల్లోనే రూ.75 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసింది. మొత్తం రూ.31.50 కోట్ల బిజినెస్ చేసిన ఈ ప్రాజెక్ట్‌ బయ్యర్లను రూ.37 కోట్లకు పైగా ప్రాఫిట్ జోన్‌లోకి నెట్టింది.

Tilak Varma: ఫైన‌ల్ పోరులో పాక్‌ను వ‌ణికించిన తెలుగు కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌!

తేజ సజ్జా ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సెస్‌కి యూనానిమస్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. డూప్ లేకుండా ఫైట్లు చేయడం, కామెడీ టైమింగ్‌తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి అదనపు హైప్ ఇచ్చాయి. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణం, రితిక నాయక్ హీరోయిన్‌గా, మంచు మనోజ్ విలన్‌గా, శ్రియా శరణ్ కీలక పాత్రలో కనిపించడం ఈ సినిమాకు మరింత బరువు తెచ్చాయి. ఈ దెబ్బతో తేజ సజ్జా టైర్ 2 హీరోలలో టాప్ లీగ్‌లోకి వెళ్లినట్లు ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Exit mobile version