Bahubali : తెలుగు సినిమాని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. మొదటిసారి ఓ తెలుగు సినిమా 500 పైగా కలెక్ట్ చేసింది. తెలుగు సినిమా చరిత్రను మార్చి టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు, రెండు పార్టులు సినిమాలు తీస్తున్నారంటే అవన్నీ బాహుబలి వల్లే.
రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా, రానా విలన్ గా తెరకెక్కిన బాహుబలి పార్ట్ 1 సినిమా 2015 జులై 10న రిలీజయి భారీ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజయి త్వరలో పదేళ్లు కావొస్తుండటంతో ఈ సినిమాని రీ రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు.
తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ పెట్టిన ఓ పోస్ట్ కి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ.. ఈ సంవత్సరం బాహుబలి రీ రిలీజ్ చేద్దామా అని రిప్లై ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు. టాలీవుడ్ సమాచారం ప్రకారం బాహుబలి 1 సినిమా పదేళ్లు పూర్తి చేసుకున్నందుకు గాను జులై 10 న రీ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. శోభు యార్లగడ్డ కూడా హింట్ ఇచ్చేయడంతో రీ రిలీజ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. ఇప్పటికే ప్రభాస్ రీ రిలీజ్ సినిమాలకు థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ చేసారు. మరి బాహుబలికి ఏ రేంజ్ లో రచ్చ చేస్తారో చూడాలి.
What do you all think ? Should we rerelease @BaahubaliMovie s this year ? 😊 https://t.co/XGPagnbRPu
— Shobu Yarlagadda (@Shobu_) March 16, 2025
ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ఉన్నాడు.
Also Read : Singer Mangli : కొత్త ఇల్లు కట్టుకున్న సింగర్ మంగ్లీ.. గృహప్రవేశం ఫోటోలు వైరల్..