Akira Nandan : అకిరాని లాంచ్ చేయడానికి పోటీ పడుతున్న నిర్మాతలు..!

Akira Nandan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ ఈమధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. రేణు దేశాయ్ నుంచి విడిపోయినా సరే అకిరా, ఆద్యలను పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటాడు.

Published By: HashtagU Telugu Desk
Producers Ready To Introduce Akira Nandan

Producers Ready To Introduce Akira Nandan

Akira Nandan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ ఈమధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. రేణు దేశాయ్ నుంచి విడిపోయినా సరే అకిరా, ఆద్యలను పవన్ కళ్యాణ్ బాగా చూసుకుంటాడు. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు. అకిరా ఎక్కడ కనబడినా సరే ఫ్యాన్స్ అంతా నానా హంగామా చేస్తున్నారు. అకిరా నందన్ ని హీరోగా హీరోగా పరిచయం చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

అకిరా కి హీరో అవ్వాలని లేదని ఆమధ్య వార్తలు వచ్చాయి. అతనికి మ్యూజిక్ కంపోజింగ్ ఇష్టమని తెలుస్తుంది. ఐతే ఫ్యాన్స్ మాత్రం అకిరా కచ్చితంగా సినిమాల్లోకి రావాల్సిందే అని అంటున్నారు. ఇదిలాఉంటే అకిరా నందన్ ని లాన్ చేయడానికి నిర్మాతలు కూడా సిద్ధం అవుతున్నారు. పవన్ తో క్లోజ్ గా ఉంటున్న ఇద్దరు నిర్మాతలు అకిరా సినిమా గురించి ఆయనతో మాట్లాడదామని అనుకుంటున్నారట.

అకిరా నందన్ ని హీరోగా పరిచయం చేయాలని ఓ పక్క మెగా ప్రొడ్యూసర్ ఏ.ఎం రత్నం ప్రయత్నిస్తున్నారట. మరోపక్క డివివి దానయ్య కూడా అకిరాతో సినిమాకు రెడీ అంటున్నాడట. ఈ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా అకిరా నందన్ ని ఇంట్రడ్యూస్ చేస్తారని అంటున్నారు. మరి అకిరా నంద మొదటి సినిమా డైరెక్టర్ ఎవరన్నది చూడాలి.

Also Read : Kalki 2 : 2025 సమ్మర్ కి రిలీజ్ సాధ్యమేనా..?

  Last Updated: 04 Jul 2024, 10:50 AM IST