Hombale Films : 5 మూవీ ప్రాజెక్టులకు 3000 కోట్ల పెట్టుబడి.. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ కీలక ప్రకటన

  • Written By:
  • Updated On - January 3, 2023 / 12:44 PM IST

KGF 2, కాంతారా, సాలార్ సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) బ్యానర్ కీలక ప్రకటన చేసింది. రాబోయే ఐదు సంవత్సరాల్లో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 3000 కోట్ల పెట్టుబడిని (Investment) పెట్టబోతున్న‌ట్టు ప్రకటించింది. KGF ఫ్రాంచైజీ , కాంతారా (Kanthara) వంటి భారీ విజయాల తర్వాత హోంబలే ఫిలిమ్స్ 2023లో ప్రభాస్ స్టారర్ “సాలార్‌” (Salar) మూవీతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వనుంది.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం బ్యాక్-టు-బ్యాక్ మెగా బ్లాక్‌బస్టర్‌లు, కంటెంట్ ఆధారిత మూవీస్ తో అగ్రస్థానంలో ఉంది. కన్నడ చలనచిత్ర పరిశ్రమ (Kannada Film Industry) గత సంవత్సరం భారతీయ సినిమాలో రెండు అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లను (KGF: చాప్టర్ 2 మరియు  కాంతారా ) అందించడం ద్వారా త‌న స్ధానాన్ని సుస్ధిరం చేసుకుంది. 2022లో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన యష్ , రిషబ్ శెట్టి ప్రాజెక్ట్, అసాధారణ విజయంతో కన్నడ పరిశ్రమ మరియు భారతీయ సినిమా రెండింటి యొక్క వాణిజ్య సరిహద్దులను అధిగమించింది. ఈ రెండు చిత్రాలను కూడా హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఇదే బ్యానర్ ఇప్పుడు వారి తొలి తెలుగు ప్రాజెక్ట్ సాలార్‌తో 2023లో తిరిగి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

హోంబలే ఫిల్మ్స్ భారీ ప్రకటన ..

హోంబలే ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడు విజయ్ కిరగందూర్ (vijay kiragandur) ఇటీవల తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే 5 సంవత్సరాలలో వినోద పరిశ్రమలో రూ.3000 కోట్లు పెట్టుబడి పెడుతామని వెల్లడించారు.

Also Read : Jr NTR and Janhvi: క్రేజీ కాంబినేషన్.. ఎన్టీఆర్ తో రొమాన్స్ కు జాన్వీ రెడీ!

ఇప్పుడు దక్షిణ భారత భాషల్లో హోంబలే ఫిలిమ్స్ బ్యాంక్ రోల్ చేస్తున్న 5 రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి తెలుసుకుందాం..

1. సాలార్

సాలార్ మూవీకి కేజీఎఫ్ డైర‌క్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు. తెలుగు సూపర్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన సాలార్, నిస్సందేహంగా ప్రస్తుతం భారతీయ సినిమా అత్యంత ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇది భారీ బడ్జెట్ వెంచర్.  మలయాళ చిత్రసీమకు చెందిన ఆల్‌రౌండ‌ర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 2023లో విడుదల కానుంది.

2. కాంతారా 2

కాంతారా సీక్వెల్ రాబోతున్నట్లు ఇటీవల విజయ్ కిరగందూర్ ధృవీకరించారు. రిషబ్ శెట్టితో హోంబలే టీమ్ మరోసారి అసోసియేట్ అవుతుందని, కాంతారావు 2 కి సహకారం ఎక్కువగా ఉంటుందని నిర్మాత వెల్లడించారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు.

3. టైసన్

పృథ్వీరాజ్ సుకుమారన్  దర్శకత్వంలో రాబోయే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ” టైసన్‌ “తో హోంబలే ఫిల్మ్స్ మలయాళ చిత్రసీమలోకి ప్రవేశిస్తోంది . సౌత్ సినిమాకి చెందిన మరో ప్రముఖ స్టార్ మరో కథానాయకుడిగా కనిపించనున్న ఈ సినిమాలో దర్శకుడే ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. ఐదు భాషల్లో విడుదల కానున్న టైసన్ 2023 ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్లనుంది.

Also Read : Pawan Tholiprema: ఫ్యాన్స్ గెట్ రెడీ.. పవన్ ‘తొలిప్రేమ’ రీరిలీజ్!

4. సూర్య-సుధ కొంగర ప్రాజెక్ట్

హీరో సూర్యతో క‌లిసి దర్శకురాలు సుధా కొంగర రెండో చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారు. దీనికి కూడా హోంబలే ఫిల్మ్స్ బ్యాంక్‌రోల్ చేస్తోంది. ఒక భయంకరమైన గ్యాంగ్‌స్టర్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలో మొద‌ల‌వుతుంది. ఈ ప్రాజెక్ట్ తమిళ చిత్ర పరిశ్రమలో హోంబలే ఫిలిమ్స్ రెండో మూవీ.

5. రఘు తథా

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ ” రఘు తథా” అనే సోషియో ఫాంట‌సీ సినిమాతో తమిళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవలే విడుదలైంది. ఈ ప్రాజెక్ట్ యొక్క నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.