మెగా హీరో వరుణ్ తేజ్ కి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. ఆయన చేస్తున్న సినిమాలు ఏవి బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాలు ఇవ్వట్లేదు. అందుకే నిర్మాతలు కాస్త ఆలోచిస్తున్నారు. మట్కా (Matka) సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. కానీ సినిమా వసూళ్లు మాత్రం దారుణంగా వచ్చాయి. సినిమా తో వరుణ్ తేజ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఇక వరుణ్ తేజ్ (Varun Tej) నెక్స్ట్ సినిమాను మేర్లపాక గాంధి (Merlapaka Gandhi) డైరెక్షన్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. ఐతే మధ్యలో ఏమైందో ఏమో కానీ సినిమా నిర్మాతలు ఎగ్జిట్ అయినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ సినిమాకు నిర్మాత ఎవరు అవుతారన్నది చూడాలి.
చిరంజీవితో విశ్వంభర..
యువి క్రియేషన్స్ ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ (Gopichand) రాధే శ్యాం డైరెక్టర్ రాధాకృష్ణతో ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఆ సినిమాను కూడా హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తుంది. ఈ దర్శకులు వేరే నిర్మాతలను చూస్తున్నారని టాక్. ఐతే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా వరుణ్ తేజ్ సినిమాకు నిర్మాతలు లేకపోవడం చాలా అవమానకరమని చెప్పొచ్చు. ఇది వరుణ్ తేజ్ కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.
టాలీవుడ్ లో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నా కూడా కొన్ని సినిమాలు మాత్రం డిజాస్టర్ రిజల్ట్ తో భారీ లాసులు తెస్తున్నాయి. అందుకే కొందరు నిర్మాతలు సినిమా మొదలు పెట్టే టైం లోనే తప్పుకుంటున్నారు.
Also Read : Pushpa 2 : పుష్ప 2 సింగిల్ టేక్ సీన్ గురించి తెలుసా.. థియేటర్ దద్దరిల్లిపోవాల్సిందే అటగా..!