టాలీవుడ్ ఫెడరేషన్ నాయకులు సినిమా షూటింగ్‌ల బంద్‌కు (Shootings Bandh) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తమకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఫెడరేషన్ నాయకులు ఈ సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా పెద్ద సినిమాలు , చిన్న సినిమాలు ఇలా అన్ని నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఫెడరేషన్ నాయకుల ప్రధాన డిమాండ్లు ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న వేతనాలపై 30 శాతం పెంపుదల కావాలని కోరుతున్నారు. అంతేకాకుండా పెంచిన వేతనాలను కూడా ఎప్పటికప్పుడు చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ డిమాండ్లను నిర్మాతలు అంగీకరించేంత వరకు తమ సభ్యులు ఎవరూ షూటింగ్‌లకు హాజరుకారని ఫెడరేషన్ నాయకులు పేర్కొన్నారు.
Upasana : ఈ నియామకం నాకెంతో గౌరవాన్నిచ్చింది.. సీఎం రేవంత్ రెడ్డికి ఉపాసన కృతజ్ఞతలు
ఈ క్రమంలో సోమవారం ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అల్లు అరవింద్, మైత్రీ రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణాప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు వంటి ప్రముఖ నిర్మాతలు, అలాగే ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజరయ్యారు. నిర్మాతల మండలి, ఫెడరేషన్ సభ్యుల మధ్య వేతనాల పెంపుదలపై చర్చలు జరిగినప్పటికీ ఇవి ఓ కొలిక్కి రాలేదని తెలుస్తుంది. నిర్మాతలు వేతనాలు పెంచడానికి సుముఖంగా లేనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ సభ్యులు లేబర్ కమిషన్‌ను కలిసే అవకాశం ఉంది. ఫిలిం ఫెడరేషన్ డిమాండ్లపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమానే కాదు చాల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. మరి ఈ సమస్యలపై త్వరగా ఓ నిర్ణయం తీసుకోవాలని అంత కోరుతున్నారు.