Site icon HashtagU Telugu

Mahesh Babu : మహేష్ బాబు చేయాల్సిన సినిమా.. తరుణ్ చేశాడు..

Producer wants Nuvvu leka Nenu Lenu Movie with Mahesh Babu but Director Request Tarun

Producer wants Nuvvu leka Nenu Lenu Movie with Mahesh Babu but Director Request Tarun

ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేయడం చాలా కామన్ గా జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) చేయాల్సిన ఒక సూపర్ హిట్ మూవీని తరుణ్(Tarun) చేసి.. ఆ హిట్టుని తన ఖాతాలో వేసుకున్నారు. మహేష్ తో ఆ మూవీ చేద్దామని నిర్మాత చెప్పినా.. దర్శకుడు మాత్రం తరుణ్‌తోనే చేయాలని పట్టుబట్టి ఆ సినిమాని తెరకెక్కించారు. ఇంతకీ ఆ సినిమా ఏంటి..?

టాలీవుడ్ లో నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటుడు ‘కాశీ విశ్వనాథ్‌’. అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కో డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన విశ్వనాథ్‌.. ‘నువ్వు లేక నేను లేను’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా కథని సిద్ధం చేసుకున్న తరువాత దగ్గుబాటి సురేష్ బాబు దగ్గరకి వెళ్లి వినిపించారట. ఆయన కథ విన్న తరువాత.. ఈ కథ మహేష్ బాబుకి బాగా సెట్ అవుతుందని చెప్పారట.

ఎందుకంటే మహేష్ ఆ సమయంలోనే ‘మురారి’ సినిమాతో సూపర్ హిట్టుని అందుకున్నారు. దీంతో ‘నువ్వు లేక నేను లేను’ సినిమాని మహేష్ తో చేద్దామని సురేష్ బాబు సూచించారట. కానీ కాశీ విశ్వనాథ్‌ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా మంది డైరెక్టర్స్ క్యూలో ఉంటారని, ఆయన డేట్స్ దొరకడం అనేది కష్టమని, ఆ డేట్స్ కోసం తాను వెయిట్ చేయలేనని, ఇప్పటికే తనకి చాలా ఆలస్యం అయ్యిందని విశ్వనాథ్‌ పేర్కొన్నారట.

ఈ కథకి తరుణ్ బాగా సెట్ అవుతాడని, తరుణ్ కూడా ‘నువ్వే కావాలి’ వంటి సినిమాతో ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్టునే అందుకున్నారని చెప్పుకొచ్చారట. ఇక దర్శకుడు పట్టుబట్టడంతో సురేష్ బాబు చేసేదిలేక.. ఆ చిత్రాన్ని తరుణ్ తో తెరకెక్కించారు. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా లయ, శరత్ బాబు, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2002 సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ ని అందుకుంది.

 

Also Read : Jagapathi Babu: జగపతిబాబు హీరో కాకపోయి ఉంటే ఆ ప్రొఫెషన్ లో ఉండేవారా?